భారత లక్ష్యం 220

INDIA TARGET 220

  • తొలి టీ20లో కివీస్ భారీ స్కోర్
  • రాణించిన టిమ్ సీఫ్రెట్

టీమిండియాతో జరుగుతున్న తొలి టీ20లో న్యూజిలాండ్ జట్టు భారీ స్కోర్ నమోదు చేసింది. ఓపెనర్లు చక్కని ఆరంభాన్ని ఇవ్వడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది. ఓపెనర్ టిమ్ సీఫ్రెట్ 84 (43 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్స్ లు) సెంచరీ కోల్పోగా.. మున్రో 34 (20 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్ లు), విలియమ్సన్ 34 ( బంతుల్లో ఫోర్లు, సిక్స్ లు) రాణించడంతో భారత్ కు కివీస్ 220 పరుగుల భారీ లక్ష్యం నిర్దేశించింది. అంతకుముందు టాస్ గెలిచిన భారత జట్టు.. న్యూజిలాండ్ కు బ్యాటింగ్ అప్పగించింది. టెస్టు, వన్డే సిరీస్ లు కోల్పోయి నిరాశలో మునిగిపోయిన తమ జట్టుకు న్యూజిలాండ్ ఓపెనర్లు శుభారంభాన్ని అందించారు. తొలి వికెట్ కు 86 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ దశలో పాండ్యా బౌలింగ్ లో మున్రో 34 (20 బంతుల్లో, 2 ఫోర్లు, 2 సిక్స్ లు) ఔట్ అయ్యాడు. మరోవైపు టిమ్ ధాటిగా ఆడి అర్థ సెంచరీ నమోదు చేసుకున్నాడు. మరో వైపు టిమ్ ధాటిగా ఆడుతూ స్కోర్ బోర్డును ఉరకలెత్తించాడు. సెంచరీ వైపు దూసుకెళ్తున్న అతడిని కేకే అహ్మద్ బౌల్డ్ చేశాడు. భారత బౌలర్లలో హార్థిక్ పాండ్యా రెండు వికెట్లు తీయగా.. కేకే అహ్మద్, భువీ, చహల్, కేహెచ్ పాండ్యా తలో వికెట్ తీశారు.

SPORTS NEWS

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article