INDIA VS AUS ODI
- గెలిచి ఆధిక్యంలోకి వెళ్లాలని టీమిండియా యోచన
ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో చక్కని విజయం సాధించిన టీమిండియా అదే ఉత్సాహంతో రెండో వన్డేకి సమాయత్తమవుతోంది. ఈ వన్డేలో కూడా గెలవడం ద్వారా టీ20 సిరీస్ లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. ఈ వన్డే సిరీస్ కు ముందు జరిగిన రెండు మ్యాచ్ ల టీ20 సిరీస్ ను భారత జట్టు ఓడిపోయిన సంగతి తెలిసిందే. రెండు మ్యాచ్ లలోనూ పేలవమైన ఆటతీరుతో పరాజయం పాలైంది. అయితే, వన్డేలకు వచ్చేసరికి మళ్లీ గాడిలో పడింది. హైదరాబాద్ లో జరిగిన తొలి వన్డేలో విజయం సాధించిన టీమిండియా.. మంగళవారం నాగ్ పూర్ లో జరిగబోయే రెండో వన్డేలోనూ విజయం సాధించాలని పట్టుదలగా ఉంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి 2–0తో ఆధిక్యం సాధించాలని టీమిండియా ఆశిస్తోంది. గత మ్యాచ్‌లో కనబర్చిన ఆల్‌రౌండ్ ప్రదర్శనను నాగ్‌పూర్‌లోనూ కొనసాగించాలని యోచిస్తోంది. విదర్భ క్రికెట్ స్టేడియం ఆసీస్‌కు కలిసి రాలేదు. ముఖ్యంగా భారత్ ఎదురైన ప్రతీసారి భారీ తేడాతోనే ఓటమి పాలైంది. తలపడ్డ మూడుసార్లు భారత్‌నే విజయం వరించింది. ఎనిమిదేళ్ల క్రితం 2011 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌పై మాత్రం గెలిచింది. ఈ రెండో మ్యాచ్ కోసం కంగారూ జట్టు ఒక మార్పు చేసింది. టర్నర్ స్థానంలో స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్ షాన్ మార్‡్షను తుది జట్టులోకి తీసుకుంది. ఇది ఫ్లాట్ పిచ్ కావడంతో మ్యాచ్ సాగే కొద్దీ నెమ్మదిస్తుంది. ముఖ్యంగా తొలుత బ్యాటింగ్ చేసినవారికే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి.