మహిళలూ పట్టేశారు

INDIA WOMEN CRICKET TEAM WON

  • కివీస్ పై 2-0తో సిరీస్ విజయం

పురుషుల జట్టే కాదు.. భారత మహిళల క్రికెట్ జట్టు కూడా జైత్రయాత్ర సాగిస్తోంది. న్యూజిలాండ్ గడ్డపై ఆ దేశాన్ని ఓడించి సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా మాదిరిగానే మన మహిళలు కూడా సత్తా చాటారు. కివీస్ తో జరుగుతన్న వన్డే సిరీస్ ను 2–0తో తేడాతో కైవసం చేసుకున్నారు. మంగళవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ మహిళలను ఓడించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌ 44.2 ఓవర్లలో 161 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్‌ అమీ సాటర్‌వైట్‌ (87 బంతుల్లో 71; 9 ఫోర్లు) మినహా ఎవరూ సరైన స్కోర్ చేయలేకపోయారు. జులన్‌ గోస్వామి 3 వికెట్టు తీయగా.. ఏక్తా బిష్త్, పూనమ్‌ యాదవ్, దీప్తి శర్మ తలా 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన భారత్‌ 35.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది. స్మృతి మంధాన (83 బంతుల్లో 90; 13 ఫోర్లు, 1 సిక్స్‌) కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ (111 బంతుల్లో 63 నాటౌట్‌; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో భారత్ గెలుపు సునాయాసమైంది.

SPORTS NEWS

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article