కొనసాగుతున్న టీమిండియా జైత్రయాత్ర

INDIA WON 1ST ODI IN KIWIS

టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. ఆస్ట్రేలియాను వారి గడ్డపై ఓడించి చరిత్ర సృష్టించిన భారత క్రికెట్ జట్టు.. రెట్టించిన సమరోత్సాహంతో కివీస్ గడ్డపై అడుగుపెట్టి, విజయ పరంపరతో దూసుకెళ్తోంది. న్యూజిలాండ్ తో బుధవారం నేపియర్ లో జరిగిన తొలి వన్డేలో కోహ్లీ సేన 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 156 పరుగుల విజయ లక్ష్యాన్ని రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ ను మన బౌలర్లు దెబ్బ తీశారు. నాలుగు ఓవర్లకే ఓపెనర్లను షమీ వెనక్కి పంపించడంతో మొదలైన కివీస్ పతనం అలాగే కొనసాగింది. న్యూజిలాండ్ సారథి విలియన్స్ (64) మినహా మిగిలిన బ్యాట్స్ మెన్ చేతులెత్తేయడంతో కివీస్ జట్టు 38 ఓవర్లలో 157 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు పడగొట్టగా, షమీ 3, చాహల్ 2, జాదవ్ ఒక వికెట్ తీశారు.

అనంతరం బ్యాటింగ్ కు దిగిన భారత జట్టుకు సూర్యడు అడ్డుపడ్డాడు. సూర్యాస్తమయం సందర్భంగా వచ్చే కిరణాలు నేరుగా భారత బ్యాట్స్ మెన్ కళ్లలోకి పడటంతో బంతిని గుర్తించడం కష్టమైంది. దీంతో మ్యాచ్ ను అరగంట పాటు నిలిపివేశారు. అనంతరం డక్‌వర్త్‌ లూయిస్‌ నిబంధనల ప్రకారం మ్యాచ్‌ను 49 ఓవర్లకు కుదించి టీమిండియాకు 156 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. ఈ క్రమంలో బ్యాటింగ్ కు దిగిన టీమిండియాకు పదో ఓవర్లో దెబ్బ తగిలింది. బ్రేస్‌వెల్‌ వేసిన రెండో బంతికి రోహిత్‌ శర్మ.. గప్తిల్‌కి క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్‌ విరాట్‌ తోడుగా ధావన్ రెచ్చిపోయి ఆడాడు. ఇద్దరూ కలిసి బౌండరీలు బాదారు. విరాట్‌- ధావన్‌ జోడీ కలిసి జట్టుకు 91 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. ఈ క్రమంలో కోహ్లీ(45) ఔటయ్యాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన రాయుడు(13)తో కలిసి ధావన్(75) టీమిండియాను గెలుపు వాకిట నిలిపాడు. దీంతో ఐదు వన్డేల సిరీస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది. రెండో వన్డే శనివారం జరగనుంది.

SPORTS UPDATES

 

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article