లెక్క సమం చేశారు

INDIA WON T20

  • కివీస్ తో రెండో టీ20లో టీమిండియా జయభేరి

న్యూజిలాండ్‌తో జరుగుతున్న టీ20లో టీమిండియా లెక్క సమం చేసింది. శుక్రవారం ఆక్లాండ్ లో జరిగిన రెండో మ్యాచ్ లో భారత జట్టు ఏడు వికెట్ల తేడాతో విజయం సాదించింది. కివీస్‌ నిర్దేశించిన 159 పరుగుల లక్ష్యాన్ని మరో ఏడు బంతులు ఉండగానే ఛేదించింది. రోహిత్‌ శర్మ(50; 29 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు), శిఖర్ ధావన్‌(30; 31 బంతుల్లో 2 ఫోర్లు) రాణించడంతో భారత గెలుపు సునాయాసమైంది. 79 పరుగుల వద్ద రోహిత్‌ ఔట్ కాగా, మరో 9 పరుగుల వ్యవధిలో శిఖర్‌ కూడా పెవిలియన్‌ చేరాడు. తర్వాత రిషభ్‌ పంత్‌, విజయ్‌ శంకర్‌ సమయోచితంగా ఆడి ఇన్నింగ్స్ చక్కదిద్దారు. తర్వాత విజయ్‌ శంకర్‌(14) మూడో వికెట్ గా ఔట్ అయ్యాడు. రిషబ్‌(40 నాటౌట్; 28 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక‍్సర్‌‌), ధోని(20 నాటౌట్‌)లు మరో వికెట్ పడకుండా జట్టుకు విజయాన్ని అందించారు. దీంతో సిరీస్‌1-1తో సమం అయ్యింది. కివీస్‌ బౌలర్లలో ఇష్‌ సోధి, డార్లీ మిచెల్‌, ఫెర్గుసన్‌లకు తలో వికెట్‌ దక్కింది. అంతకముందు బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 158 పరుగులు చేసింది.

SPORTS NEWS

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article