సంక్రాంతికి భారతీయుడు-2?

28
Indian-2 for sankranthi?
Indian-2 for sankranthi?

Indian-2 for sankranthi?

లోక నాయకుడు కమల్ హాసన్ కెరీర్ లో ఓ కలికితురాయిగా చెప్పుకునే సినిమాల్లో ‘భారతీయుడు’ఒకటి. శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ఆల్ టైమ్ గ్రేట్ మూవీస్ లిస్ట్ లో నిలుస్తుందని చెప్పొచ్చు. కమల్ హాసన్ నటనకు ఫిదా కాని వారు లేరు. రెండు పాత్రల్లోనూ అద్భుతంగా ఆకట్టుకున్న కమల్ కు ఆ తర్వాత ఆ రేంజ్ అప్లాజ్ వచ్చిన సినిమా కూడా రాలేదనేది నిజం కావడం విశేషం. అలాంటి గ్రేట్ మూవీకి సీక్వెల్ అనగానే చాలామంది ఆసక్తిగా చూశారు. పైగా పాతికేళ్ల తర్వాత సీక్వెల్ అంటే ఖచ్చితంగా ఆ కథ ప్రకారం అదే ప్రధాన పాత్రతో అనేది దాదాపు అసాధ్యం. అలాంటిది ఆ మెయిన్ క్యారెక్టర్ ను శంకర్ ఎలా కన్విన్స్ చేస్తాడా అనే క్యూరియాసిటీ ప్రతి ఒక్కరిలోనూ ఉంది. అయితే సినిమా ఆరంభం అనుకున్నదానికంటే ఎక్కువ లేట్ అయింది. అటుపై కాస్టింగ్ అంతా పూర్తి చేసుకుని సెట్స్ పైకి వెళ్లారు. ఈ లోగా అనుకోని ప్రమాదంతో భారతీయుడు సెట్స్ లో ముగ్గురు హెల్పర్స్ మరణించారు. దీంతో ఆ గొడవ కాస్తా పోలీస్ స్టేషన్ నుంచి కోర్ట్ వరకూ వెళ్లింది. ఈ కారణంగా షూటింగ్ కూడా ఆగిపోయింది.

ఇక అంతా సెట్ చేసుకుని మళ్లీ సెట్స్ లోకి వెళదాం అనుకునే టైమ్ కు మాయదారి కరోనా వచ్చింది. దీంతో ఈ సినిమా షూటింగ్ అందర్లానే ఆగిపోయింది. ఇక లేటెస్ట్ గా వినిపిస్తోన్న దాన్ని బట్టి భారతీయుడు-2 వచ్చే యేడాది ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ కు వెళుతుందట. అప్పటి నుంచి ఎలాంటి బ్రేకులు లేకుండా స్మూత్ గా షూటింగ్ ఫినిష్ చేయాలనే ఉద్దేశ్యంలో ఉన్నాడు శంకర్. ఈ మేరకు తన టీమ్ తో కలిసి పర్ఫెక్ట్ ప్లానింగ్ కూడా సిద్ధం చేసుకుంటున్నాడట. ఆరు నెలల్లో షూటింగ్ పూర్తి చేసి ఆ తర్వాత యేడాది అంటే 2020 సంక్రాంతికి భారతీయడు-2ను విడుదల చేయాలనే ఫిక్స్ అయ్యారట. అంటే 2022 సంక్రాంతి బరిలో భారతీయుడు -2 ఆల్రెడీ కర్చీఫ్ వేశాడన్నమాట. మరి ఈ డేట్ లో ఏమైనా మార్పులు వస్తాయా అనేది కరోనా డిసైడ్ చేస్తుంది. కానీ ఇప్పటికైతే భారతీయుడు -2…  2022 సంక్రాంతికి వస్తుందనుకోవచ్చు.

tollywood news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here