వాణిజ్యత‌ర‌హా శిక్ష‌ణ‌కు ఎదిగేందుకు చొర‌వ‌

49

హైద‌రాబాద్, అక్టోబ‌ర్ 13, 2021: ఐఐటీ, జేఈఈ, నీట్ రాయాల‌నుకునే వారికి అత్యుత్త‌మ శిక్ష‌ణ ఇచ్చేందుకు హైద‌రాబాద్‌లో యాక్టివ్ టీచింగ్ యాక్టివ్ లెర్నింగ్ (అట‌ల్‌) క్లాసులు బుధ‌వారం ప్రారంభ‌మ‌య్యాయి. బోధ‌న‌రంగంలో అత్యుత్త‌మ వ్య‌క్తులు కలిసి ప్రారంభించిన ఈ అట‌ల్ క్లాసుల వెనుక ప్ర‌ముఖ విద్యావేత్త‌లు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర పోలీసు అకాడ‌మీ మాజీ డైరెక్ట‌ర్, రిటైర్డ్ ఐపీఎస్ అదికారి, ప్ర‌స్తుతం పంజాబ్ ప్ర‌భుత్వ స‌ల‌హాదారు శ్రీ వి.కె. సింగ్ ఈ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు.

అట‌ల్ క్లాసుల‌కు మెంటార్‌గా కూడా వ్య‌వ‌హ‌రిస్తున్న వి.కె. సింగ్ ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ, “పోటీ ప‌రీక్ష‌ల్లో అగ్ర‌స్థానంలో నిల‌వాల‌ని ప్ర‌తి ఒక్క విద్యార్థి, వాళ్ల త‌ల్లిదండ్రులు క‌ల‌లుగంటారు. చ‌దువు అంటే నాకు ఎన‌లేని ప్రేమ‌. కానీ, ప్ర‌స్తుత వాణిజ్య త‌ర‌హా ట్యుటోరియ‌ళ్లు నాజీల కాన్సంట్రేషన్ క్యాంపు త‌ర‌హాలో చ‌దువు చెబుతున్నాయి. ఈ ట్యుటోరియ‌ళ్ల‌లో అర్థజ్ఞానం లేకుండా చెప్పినదాన్నే మ‌ళ్లీ మ‌ళ్లీ చెప్ప‌డ‌మే గొప్ప‌గా మారింది. పిల్ల‌ల‌కు క‌మ్యూనికేష‌న్ నైపుణ్యాలు, వ్యూహాత్మ‌క అభ్య‌స‌నం, ఒత్తిడి లేకుండా ప‌రీక్ష‌ల‌కు సిద్ధం కావ‌డం, ప‌రీక్ష‌లు రాయ‌డం ఎలాగో చెప్ప‌డంపై దృష్టి పెట్ట‌ట్లేదు” అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here