ఏలూరు:గ్రీన్ఫీల్డ్ హైవే భూసేకరణలో రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఎపి రైతుసంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి కేశవ్ అన్నారు.గ్రీన్ఫీల్డ్ హైవే భూనిర్వాసిత రైతులకు మార్కెట్ ధర ప్రకారం పరిహారమివ్వాలని, సర్వీస్ రోడ్లు, అండర్పాసులు నిర్మించాలని డిమాండ్ చేస్తూ ఎపి రైతు సంఘం, గ్రీన్ ఫీల్డ్ హైవే భూనిర్వాసిత రైతుల పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఏలూరు జిల్లాలో రైతులు ధర్నా నిర్వహించారు.తెలంగాణా కంటే ఇక్కడ తక్కువ పరిహారం రైతులకు ఇచ్చి బలవంతంగా భూములను లాక్కోవడం దుర్మార్గమన్నారు. గ్రామ సభలు నిర్వహించకుండా చట్టవిరుద్ధంగా భూ సేకరణ చేయడం తగదన్నారు. రైతుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా భూసేకరణ అధికారులు వ్యవహరించడం అన్యాయమన్నారు.గ్రామ సభలు నిర్వహించి ఆయా గ్రామాల రైతులు, ప్రజల సమస్యలను పూర్తిగా పరిష్కరించాలని కోరారు. ఉద్యాన, వ్యాపార పంటలకు తగిన పరిహారం ఇవ్వాలన్నారు. బోర్లు కోల్పోయిన రైతులకు ఉచితంగా బోర్లు వేయాలని డిమాండ్ చేశారు.