మాజీ ప్రధాని శాస్త్రి కా

Insult for Priyanka Gandi

అవమానం….ప్రియాంకా గాంధీ కా

యూపీలో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాలని భావించిన ప్రియాంకా గాంధీ గంగా యాత్ర చేస్తున్నారు. గంగా పరీవాహక ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు . తాజాగా ఆమె చేసిన ఒక పని వివాదాస్పదం అవుతుంది. కావాలని చేశారని చెప్పలేం కానీ హడావుడితో ఆమె చేసిన పని ఇప్పుడు బీజేపీకి ఆయుధం అయ్యింది. తాజాగా ప్రియాంక గాంధీ చేసిన తప్పును భారీ ఎత్తున ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రిని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ అవమానించారంటూ కొత్త ఆరోపణను తెర మీదకు తెచ్చారు కేంద్రమంత్రి స్మృతి ఇరానీ.
తాజాగా ఆమె ఒక వీడియోను షేర్ చేశారు. ఇందులో తనకు వేసిన పూలమాలను ప్రియాంక లాల్ బహదూర్ శాస్త్రి విగ్రహానికి వేసిన వైనాన్ని ప్రశ్నిస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె ఒక వ్యంగ్య కవితను సైతం పోస్ట్ చేశారు. ఇంతకీ ఈ సీన్ ఎక్కడ చోటు చేసుకున్నదంటే.. ఎన్నికల ప్రచారంలో భాగంగా గంగా యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమె రామ్ నగర్ లోని శాస్త్రి గృహాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆమెకు ఘన స్వాగతం లభించింది. ఆమె మెడలో పూల మాలలు వేశారు. తనకువేసిన ఒక పూలదండను చేత్తో పట్టుకున్న ఆమె.. లాల్ బహదూర్ శాస్త్రి విగ్రహానికి వేసేశారు. దీంతో.. ప్రియాంక మాజీ ప్రధానిని అవమానించారన్న ప్రచారాన్ని బీజేపీ నేతలు షురూచేశారు. ప్రియాంక వెళ్లిన కాసేపటికి అక్కడికి చేరుకున్న కమలనాథులు లాల్ బహదూర్ శాస్త్రి విగ్రహాన్ని గంగా జలంతో శుద్ధి చేశారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article