అసైన్‌మెంట్లు సమర్పించండి

183
Inter Board
Inter Board

Inter Board Told To Submit Assignments

మొదటి సంవత్సరం పర్యావరణ, నైతిక విలువల పరీక్షలపై తెలంగాణ ఇంటర్‌బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆ రెండు పరీక్షలు అసైన్‌మెంట్ల రూపంలో ఇంట్లోనే రాసి పంపాలని ఇప్పటికే బోర్డు ప్రకటించింది. ఈ నేపథ్యంలో విద్యార్థులు తమ అసైన్‌మెంట్లు ఏవిధంగా పంపాలనేదానిపై తాజాగా ఇంటర్‌బోర్డు కార్యదర్శి జలీల్‌ఖాన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఏప్రిల్‌ 1 నుంచి 20 వరకు అసైన్‌మెంట్లను కళాశాలల్లో సమర్పించాలని సూచించారు. నేరుగా, ఈమెయిల్‌ ద్వారా కూడా పంపించవచ్చని చెప్పారు. అసైన్‌మెంట్లపై విద్యార్థుల హాల్‌ టికెట్‌ నంబర్‌ తప్పనిసరిగా వేయాలన్నారు. ఇంటర్‌ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఏప్రిల్‌ 1 నుంచి హాల్‌టికెట్లు జారీ చేస్తామని జలీల్‌ఖాన్‌ తెలిపారు. tsbie.cgg.gov.in వెబ్‌సైట్‌ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని చెప్పారు.

 

Telangana Inter Board News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here