చాక్లెట్ దొంగతనం .. బలైన నిండు ప్రాణం

Inter student died in D-Mart security attack

హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌లో దారుణం చోటుచేసుకుంది. కేవలం ఒక చాక్లెట్ కోసం ఒక నిండు ప్రాణం బలైంది.  ఓ ప్రముఖ మాల్‌లో చాక్లెట్ దొంగిలించాడని  సిబ్బంది చేసిన దాడిలో ఇంటర్ విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు హయత్‌నగర్‌లోని ప్రముఖ  కాలేజీలో ఇంటర్ చదువుతున్న సతీష్‌గా గుర్తించారు. ఇక సతీష్ షాపింగ్ చేయడం కోసం ఆదివారం సాయంత్రం తన స్నేహితులతో కలిసి వనస్థలిపురంలోని ఓ మాల్‌కు వెళ్లాడు . అక్కడ చాక్లెట్ దొంగలించాడని అతడిని సెక్యూరిటీ సిబ్బంది పట్టుకున్నారు. ఆ తరువాత వారిద్దరి మధ్య గొడవ అయ్యింది. ఈ క్రమంలో సెక్యూరిటీ సిబ్బంది సతీష్‌పై దాడి చేశారని దాంతో అతడు అక్కడికక్కడే మరణించినట్లు సతీష్  తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.అయితే ఈ ఘటనను సతీష్ కుటుంబసభ్యులు, గిరిజన నేతలు ఖండిస్తున్నారు. వనస్థలిపురంలో ఉన్న మాల్ అద్దాలను ద్వంసం  చేసి తమ నిరసనను వ్యక్తం చేశారు . మాల్‌ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు .ఇక  పేరెంట్స్ అనుమతి లేకుండానే సతీష్‌ను కాలేజీ యాజమాన్యం బయటకు పంపినట్లు తెలుస్తోంది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు .

Inter student died in D-Mart security attack,hyderabad , lb nagar , shopping mall , chocolate theft, security  attack, student died , sathish 

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article