- నేడు అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా
- గిరిజనులకు శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి
నేడు అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరిజనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మూలవాసులుగా, అమ్మలాంటి అడవికి తోడుండే భూమిపుత్రులుగా, కల్మశంలేని అనుబంధాలకు ప్రతీకలుగా ఆదివాసీలు నిలుస్తారని, అలాంటి గిరిజనుల హక్కుల పరిరక్షణకు, వారి సంక్షేమాభివృద్ధికి ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి ఓ సందేశంలో తెలిపారు.
రూ.17,056 కోట్ల కేటాయింపుతో బడ్జెట్ లో గిరిజన సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చామన్నారు. గతంలో పేరుకు పంచాయతీలుగా మారినా పైసా నిధులు లేక నిర్లక్ష్యానికి గురైన గిరిజన గూడేల్లో రోడ్లు, విద్యుత్, వైద్యం, విద్య వంటి మౌలిక సదుపాయాల కల్పనకు తమ ప్రభుత్వం సంకల్పించిందని ముఖ్యమంత్రి గుర్తుచేశారు.