బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా యోగా దినోత్సవం

 • బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా యోగా దినోత్సవం
  *యోగా గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత మోదీదే
  *బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్
  హైదరాబాద్:అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఈరోజు ఘనంగా యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా దినోత్సవ కార్యక్రమంలో జాతీయ సంస్థాగత సహ ప్రధాన కార్యదర్శి శివ ప్రకాశ్, పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల నిర్వహణ ఇంఛార్జ్ అరవింద్ మీనన్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, మంత్రి శ్రీనివాసులు, బంగారు శ్రుతి తదితరులు పాల్గొన్నారు.
  ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. దేశవ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో 75 వేల ప్రదేశాల్లో యోగా దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. రాష్ట్రంలోనూ ప్రాముఖ్యత కలిగిన అనేక ప్రాంతాల్లో యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని అన్నారు.
  ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఎవరో ఒకరు ఏదైనా అంశానికి సంబంధించి దాని ప్రాముఖ్యతను తెలియజేస్తే తప్ప సమాజం పాటించే పరిస్థతి లేదు. ఈ నేపథ్యంలో యోగా గొప్పతనాన్ని, భారతీయ సనాతన ధర్మాన్ని ప్రపంచానికి చాటి చెబుతున్న నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఆయన బాటలో నడుస్తూ ప్రతి ఒక్కరూ నిత్యం యోగా చేయడంతోపాటు మరో పది మందితో యోగా చేసేలా క్రుషి చేయాలని అన్నారు.
  శివ ప్రకాశ్ మాట్లాడుతూ ఆరోగ్యానికి యోగా ఎంతో మేలు చేస్తుందన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజు మాత్రమే కాకుండా ప్రతి నిత్యం యోగా చేయడం అలవర్చుకోవాలని సూచించారు. అనంతరం యోగా ట్రైనర్ నాగమణిని బండి సంజయ్ శాలువా కప్పి సత్కరించారు.
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article