అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు

కాకినాడ: కేవలం రైల్వే స్టేషన్లు, రైళ్ళు టార్గెట్ గా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న ఒక నిందితుడిని కాకినాడ రైల్వే సీఐ దానేటి రామారావు అరెస్టు చేశారు .అతని వద్ద నుంచి 17 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.రైల్వే సీఐ రామారావు కథనం ప్రకారం ఒరిస్సా రాష్ట్రం కంధ్యా ప్రాంతానికి చెందిన గోపాల్ సాహూ అంతర్రాష్ట్ర దొంగ. ఈనెల 12వ తేదీన సామర్లకోట రైల్వే స్టేషన్లో ప్రశాంతి ఎక్స్ ప్రెస్ రైలు ఎక్కాడు. ఆ రైలు లో ప్రయాణం చేస్తున్న ఓ ప్రయాణికుడికి మత్తుమందు ఇచ్చాడు. అతని మెడలో గొలుసు, చేతి ఉంగరం ఎత్తుకుపోయాడు. అతను ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. రైల్వే సి ఐ రామారావు దర్యాప్తు ముమ్మరం చేశారు. బుధవారం సామర్లకోట రైల్వే స్టేషన్ ఒకటో నెంబర్ ప్లాట్ ఫారం పై అనుమానాస్పదంగా తిరుగుతున్న సాహూ ను ప్రశ్నించారు. వారికి అనుమానం వచ్చింది. సీఐ రంగప్రవేశం చేశారు. తమదైన శైలిలో విచారించారు .నిందితుడు పూర్తి నిజాలు బయట పెట్టాడు. సామర్లకోట లో దొంగతనం చేసిన రోజునే అదే ప్రశాంతి ఎక్స్ ప్రెస్ లో గుంటూరు నరసరావుపేటకు చెందిన ఓ ప్రయాణికుడికి ఇలాగే మత్తుమందిచ్చి అతని సెల్ ఫోన్ కూడా ఎత్తుకుపోయాడు.లోరోపాజం అనే మత్తు మందు దగ్గర పెట్టుకుంటాడు. రైల్ ఎక్కుతాడు. ప్రయాణికులతో మాటలు కలుపుతాడు. వారికి టీ లేదా కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి ఇస్తాడు. 10 నిమిషాల్లో వారు మత్తులోకి జారిపోతారు. వారి వద్ద ఉన్న నగదు, బంగారు ఇతర విలువైన ఆభరణాలు ఎత్తుకు పోతాడు. ఇతనిపై పలు పోలీసు కేసులు నమోదయ్యాయి. వైజాగ్ లో రెండు కేసులు తోపాటు ఒరిస్సాలో కూడా కేసులు ఉన్నాయి. గతంలో విశాఖ లో దొంగతనం చేసి మూడేళ్లు జైలు శిక్ష అనుభవించిన వచ్చాడు. ఇప్పటికీ కొన్ని కేసులు పెండింగ్ లో ఉన్నాయి. గుంటూరు పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ వేశారు. నిందితుడిని పూర్తిస్థాయిలో విచారణ అనంతరం కోర్టు లో ప్రవేశపెడతామని సిఐ రామారావు తెలిపారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article