ఐఫోన్ 11లో ట్రిపుల్ కెమెరా?

New Iphone 11 Come with Triple camera

  • ఫస్ట్ లుక్ లీక్
  • సెప్టెంబర్ లో అందుబాటులోకి కొత్త ఫోన్

మొబైల్ ఫోన్లలో రారాజు ఐ ఫోన్ నుంచి ట్రిపుల్ కెమెరాతో ఫోన్ రాబోతోందా? ఐఫోన్ ఎక్స్ ఎస్, ఐఫోన్ ఎక్స్ ఎస్ మ్యాక్స్, ఐఫోన్ ఎక్స్ ఆర్ పేర్లతో మూడు ఫోన్లను లాంచ్ చేసిన ఆపిల్ కంపెనీ.. తదుపరి ఫోన్ తయారీపై ఇప్పటికే దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఐఫోన్ 11 గా పిలిచే ఈ ఫోన్ ను ఈ ఏడాది సెప్టెంబర్ లో విడుదల చేయనుంది. ఈ ఫోన్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ లీక్ అయింది. కేవలం వెనుక వైపు ప్యానల్ మాత్రమే ఇందులో కనిపిస్తోంది. ఫోన్ ఎడమ వైపు పై భాగంలో మూడు కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటితోపాటు లెడ్ ఫ్లాష్, ఓ మైక్రోఫోన్ కూడా కనిపిస్తున్నాయి. అంటే, త్వరలో రాబోయే ఈ ఐఫోన్ 11లో ట్రిపుల్ కెమెరా ఉన్నట్టు తెలుస్తోంది. ఇది ఒకరకంగా యాపిల్ ప్రేమికులకు శుభవార్తే అయినప్పటికీ, ఫోన్ లుక్ విషయానికి వస్తే మాత్రం నిరుత్సాహం తప్పదు. తాజాగా లీకైన ఐఫోన్ 11 అపీరియన్స్ అంత ఆకర్షణీయంగా లేదు. హువావే మేట్ 20 ప్రో లుక్ కు దగ్గరగా ఈ ఫోన్ ఉండటం గమనార్హం. ఇప్పటివరకు వచ్చిన ఐఫోన్ల కంటే మరిన్ని మెరుగైన ఫీచర్లతో కొత్త ఫోన్ ఉండనుందని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు లీకైన చిత్రం.. ఫోన్ పూర్తిస్తాయిలో తయారుకాక ముందు తీసి ఉంటుందని, అందుకే అలా ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ ఫోన్ రావడానికి ఇంకా తొమ్మిది నెలల సమయం ఉన్నందున.. తుది రూపు ప్రస్తుత ఐఫోన్ల కంటే ఆకర్షణీయంగా ఉండటం ఖాయమని పలువురు అభిప్రాయపడతున్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article