జోరుగా ఐపీఎల్ బెట్టింగ్-జేబులు గుల్లా

58
IPL Bettings Hyderabad
IPL Bettings Hyderabad

IPL Bettings in Hyderabad

పరుగుకు ఓ రేటు, బంతి బంతికి మరో రేటు, వికెట్, టాస్, విజేత ఇలా ప్రతీ అంశానికో రేటు నిర్ణయిస్తూ ఐపీఎల్ బెట్టింగ్ లు జోరుగా సాగుతున్నాయి. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా ఐపీఎల్ దంద జరుగుతోంది. రూ.వంద బెట్టింగ్‌ పెడితే గెలిచిన వారికి రూ.వెయ్యి చొప్పున అందిస్తుండగా, కొందరు మాత్రమే గెలుస్తూ ఎక్కువ మంది ఆర్థికంగా నష్టపోతున్నారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల యువకులు, విద్యార్థులను బడా వ్యాపారులు బుట్టలో వేసుకుని బెట్టింగ్‌ కడుతుండంతో రూ.లక్షల్లో చేతులు మారుతోంది.

చేతులు మారుతున్న లక్షలు

వివిధ ప్రాంతాల్లో కొందరు గ్రూపులుగా ఏర్పడి బెట్టింగ్‌కు పాల్పడుతున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ కొంత మంది బుకీల సాయంతో కానిచ్చేస్తున్నారు. ఇంట్లో టీవీ ముందు కుర్చోని లేదా సెల్‌ఫోన్‌లో మ్యాచ్‌ చూస్తూ బెట్టింగ్‌ కాస్తున్నారు. ఏ టీం ఎన్ని పరుగులు చేస్తుంది, ఏ జట్టు గెలుస్తుంది, ఏ బ్యాట్స్‌మెన్‌ ఎన్ని పరుగులు చేస్తాడు, ఏ బౌలర్‌ ఎన్ని  వికెట్లు తీస్తాడనే అంశాలపై బెట్టింగ్‌ సాగుతోంది. మ్యాచ్‌ అయిపోగానే ఎవరికి ఎంత ఇవ్వాలో లెక్క చూసుకుంటున్నారు. రూ.వంద మొదలు రూ.లక్షల వరకు బెట్టింగ్‌ సాగుతుండడంతో ప్రతీ ఆటకు రూ.లక్షల్లో చేతులు మారుతున్నట్లు సమాచారం. బెట్టింగ్‌కు పాల్పడుతున్న సామాన్య, గ్రామీణ ప్రాంత ప్రజలు, యువకులు ఆర్థికంగా నష్టపోతూ అప్పుల్లో కూరుకుపోతున్నారు. బెట్టింగ్‌ వల్ల బుకీలకు లాభం చేకూరుతుండగా సామాన్యుల జేబులు మాత్రం గుల్లవుతున్నాయి.

హైదరాబాద్ లో పట్టుబట్ట ముఠా

ఓ ఇంట్లో బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను బాలనగర్ ఎస్‌ఓటీ పోలీసులు 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురు తప్పించుకున్నారు. అరెస్ట్‌ చేసిన వారి వద్ద నుంచి 9 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here