ఒక్క సన్నివేశంతో ఒక్కసారిగా పాపులర్ అయిన్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్. కన్నుగీటి పాన్ ఇండియా లెవల్‌లో సంచలనం సృష్టించింది. మలయాళంలో ఒరు ఆధార్ లవ్ అనే ఒక చిన్న సినిమా టీజర్ లో అమ్మడు ఇచ్చిన ఎక్స్ ప్రెషన్ తో సోషల్ మీడియా అంతా షేక్ అయ్యింది. ఆ క్రేజ్ తో ఆ సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేశారు. ఐతే సినిమా టీజర్ కి వచ్చిన క్రేజ్ కి తగినట్టు సినిమా లేకపోవడం వల్ల మైనస్ అయ్యింది. ఆ తర్వాత ప్రియ ప్రకాష్ కి తెలుగు నుంచి ఆఫర్స్ వచ్చాయి. ఐతే చేస్తే స్టార్స్ తోనే చేస్తా అని అమ్మడు బెట్టు చేయడంతో మన వాళ్లు లైట్ తీసుకున్నారు. తీరా కెరీర్ గ్రాఫ్ పడిపోతుంది అనుకున్న టైం లో ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ టాలీవుడ్ వైపు చూసింది. అలా నితిన్ తో చెక్ సినిమా చేయగా అది కాస్త తుస్సుమన్నది. ఇక తేజా సజ్జాతో ఒక సినిమా చేయగా అది కూడా ప్రేక్షకులను మెప్పించలేదు. తనకు వచ్చిన సోషల్ మీడియా క్రేజ్ కి ప్రియా ప్రకాష్ కెరీర్ కి అసలు సంబంధం లేదు. అయినా సరే అమ్మడు తన ప్రయత్నాలు మాత్రం ఆపలేదు. ఏ చిన్న ఛాన్స్ వచ్చినా కూడా వదలకుండా చేస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే లేటెస్ట్ గా అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో ఒక రీమిక్స్ సాంగ్ లో మెప్పించింది. అజిత్ సుల్తానా సాంగ్ లో సిమ్రన్ లా ప్రియా ప్రకాష్ కూడా అదరగొట్టింది. తెలుగులో ఒకటి రెండు ప్రయత్నాలు చేసినా లాభం లేకపోవడంతో సైలెంట్ అయిన ప్రియా ప్రకాష్ మలయాళంలోనే వచ్చిన అరకొర అవకాశాలతో కెరీర్ కొనసాగిస్తుంది.