విజయవాడ:తన సస్పెన్షన్ పై సినీయర్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వ రావు స్పందించారు. సస్పెన్షన్ జీవో నా చేతికి ఇంకా ఇవ్వలేదు. సామాజిక మాధ్యమాల్లో మాత్రమే చూసాను. ఏసీబీ కేసు ఉన్న మాట వాస్తవమే. ఒకటిన్నర సంవత్సరం క్రితం కేసు రిజిష్టర్ చేసినా ఇంతవరకూ చార్జిషీట్ వేయలేదని అయన అన్నారు. ట్రయల్ మొదలవకుండా సాక్షులను నేను ఎలా ప్రభావితం చేస్తాను….?? ఎటువంటి చచ్చు సలహాలు ఏ తీసేసిన తహసీల్దార్ లేక పనికిమాలిన సలహాదారులో ఇచ్చి ఉంటారు…! ఒకసారి హై కోర్టు కొట్టేసినప్పుదు అదే సెక్షన్ కింద మళ్లీ ఎలా సస్పెండ్ చేస్తారు. 12 సీబీఐ,6 ఈడీ కేసుల్లో జగన్ కు చార్జిషీట్ లు ఉన్నాయి.ఐయేఎస్ అధికారిణి శ్రీలక్ష్మి పైనా చార్జిషీట్ లు ఉన్నాయి. శ్రీలక్ష్మి కి వర్తించని నిబంధనలు నాకు ఎలా వర్తిస్తాయి. ఏసీబీ వాళ్ళు ఇచ్చిన నివేదికలో ప్రతి వాక్యం తప్పు.నేను నిరూపిస్తాను. ఒక్క రూపాయి అవినీతి జరగని చోట అవినీతి కేసు ఎలా పెడతారు. ఇజ్రాయెల్ వాళ్లకు రెండు లెటర్ లు రాశారు.అవినీతి నిరోధక చట్టాలకు లోబడి పనిచేస్తామని చెప్పారు. ఇలాంటి వ్యక్తుల వల్ల వ్యవస్థలకు చెడ్డ పేరు వస్తుంది. కొంతమంది వ్యక్తులు, కొన్ని శక్తులు నన్ను టార్గెట్ చేసాయి. కోడికత్తి కేసు అడ్డుపెట్టుకుని రాష్ట్రాన్ని తగలబెట్టాలని చుస్తే గంటల్లోనే అడ్డుకున్నాను. ఎన్నో వెధవ పనులు అడ్డుకున్నందుకే నన్ను టార్గెట్ చేశారు. ప్రభుత్వాన్ని పడగొడతా అని రాజభవన్ గేటు ముందు నేను కామెంట్ చేశానా అని ప్రశ్నించారు.
ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలపై న్యాయపోరాటం చేస్తాను. సమజానికి హాని కలిగించే పురుగులను తొలగించే వ్యవసాయం చేస్తున్నా. దుర్మార్గుడైన రాజు పాలనలో పని చేసెకంటే అడవిలో వ్యవసాయం చేసుకోవడం మంచిదని ఒక కవి అన్నాడని అయన వ్యాఖ్యానించారు.
సస్పెన్షన్ పై స్పందించిన సినీయర్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వ రావు
