సర్వీసులకు మహేష్ దత్ఎక్కా
రాష్ట్రంలో ఆరుగురు ఐఏఎస్‌ల బదిలీ
రాష్ట్రంలో ఆరుగురు ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జీఏడీలోకి కీలక విభాగాలకు అధికారులను భర్తీ చేశారు. జీఏడీలోని స్టార్ట్ గవర్నెన్స్, రవాణా, గృహ నిర్మాణం శాఖకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వికాస్ రాజ్‌ను నియమించారు. ఇక, జీఏడీ సర్వీసుల ముఖ్య కార్యదర్శిగా బెనహర్ మహేష్ దత్ఎక్కాను నియమించారు. ఇప్పటి వరకు సర్వీసుల విభాగానికి ఖాళీ ఉండటంతో.. ఉద్యోగులకు సంబంధించిన చాలా అంశాలు పెండింగ్ లో ఉన్నాయి.
పదోన్నతులు, బదిలీల ఫైళ్లు కూడా ఆగిపోయాయి. దీంతో ఉద్యోగ వర్గాల నుంచి వినతులు రావడంతో.. జీఏడీ సర్వీసుల విభాగానికి ఐఏఎస్ అధికారి ఎక్కాను నియమించారు. గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్‌గా ఎ. శరత్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఎండీగా కొర్ర లక్ష్మీ, విపత్తు నిర్వహణ ప్రత్యేక కార్యదర్శిగా హరీష్‌కు బాధ్యతలు ఇస్తూ సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. హనుమకొండ స్థానిక సంస్థల అదనపు కమిషనర్ రాధికా గుప్తాను మేడ్చల్‌కు బదిలీ చేశారు.