ట్రంప్ తల తెస్తే 80 మిలియన్ డాలర్లు

Iran Offers $80 Million On Donald Trump Head

అమెరికా , ఇరాన్ ల మధ్య వార్ ముదురుతుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను హతమార్చి ఆయన తల తెచ్చినవారికి  80 మిలియన్ డాలర్ల రివార్డ్ ఇస్తామని ఇరాన్ ప్రకటించింది. అమెరికా వైమానిక దాడుల్లో దుర్మరణం చెందిన ఇరాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఖాసిం సులేమానీ మృతదేహంను చూసి ఇరాన్ అధ్యక్షుడు అయతుల్లా అలీ ఖామేనీ దారుణంగా విలపించారు. మృతి చెందిన ఖాసిం అయతుల్లాకు కుడి భుజంగా వ్యవహరించేవాడు. తన ఆప్త మిత్రుడిని అలా చూసి బాధను ఆపుకోలేకపోయిన అయతుల్లా గట్టిగా ఏడుస్తూ అమెరికాను సర్వనాశనం చేస్తానంటూ ఖసిం మృతదేహంపై ప్రతినబూనారు. ఇప్పటికే ఖాసిం స్థానంలో కొత్తగా మరొక వ్యక్తిని ఆర్మీ చీఫ్‌గా నియమించడం జరిగింది. మరోవైపు ఇరాక్ గడ్డపై ఉన్న అమెరికా బలగాలను తరిమికొట్టాలని ఇరాక్ పార్లమెంటు తీర్మానించింది.

ఖాసిం మృతికి కారకుడైన ట్రంప్ ను హతమార్చినవారికి ఈ భారీ ‘ బహుమతి ‘ దక్కనుందని ఇరాన్ పేర్కొంది. సులేమాన్ అంతిమ యాత్ర సందర్భంగా.. ఆ దృశ్యాన్ని ప్రసారం చేస్తున్న టీవీ ఛానల్ ఒకటి.. దేశంలోని ప్రతి ఇరానీయుడూ ఒక డాలర్ ను ‘ విరాళం ‘ గా ఇస్తే ఆ నగదును మొత్తం కలిపి అమెరికా దేశాధ్యక్షుడిని చంపినవారికి రివార్డుగా ఇస్తామని ప్రకటించింది. దేశంలో 80 మిలియన్ల మంది ప్రజలు ఉన్నారని, ఈ జనాభాను బట్టి 80 మిలియన్ డాలర్లను సమీకరించాలనుకుంటున్నామని తెలిపింది. కాగా- తాము అమెరికా లోని శ్వేత సౌధం వైట్ హౌస్ మీద దాడి చేయగలుగుతామని, అమెరికా గడ్డపైనే వారిని ఎదుర్కోగలుగుతామని  అబుల్ ఫజల్ అబూ తొలాబీ అనే ఎంపీ పేర్కొన్నారు. ఇది ఒక విధంగా యుధ్ధ ప్రకటనే అన్నారు. ఆదివారం జరిగిన పార్లమెంట్ ఓపెన్ సెషన్ లో.. ట్రంప్ ను ‘ ఓ సూట్ కేసులోని టెర్రరిస్టు ‘ గా అభివర్ణించారు.

Iran Offers $80 Million On Donald Trump Head, America, Iran, war, America Attacks, Iran Army Chief, Khasim Sulemani Died, Trump Head , 80 Million Dollars Reward, Iran President Ayatulla Ali Khomeni

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *