నిస్సిగ్గుగా సూపర్ స్టార్.. నిక్కచ్చిగా విజయ్

116
shock to vijay
shock to vijay

Is BJP Government Targeting Tamil actor Vijay

అధికారం చేతిలో ఉన్నవాడు ప్రశ్నలకు సహించడు. అలాగని డైరెక్ట్ గానూ అటాక్ చేయడు. వ్యవస్థను అడ్డు పెట్టుకుంటాడు. వ్యవస్థీకృతంగా చేయాల్సిన అంశాన్ని వ్యక్తిగత కక్షగా మార్చుకుంటాడు. ఇప్పుడు తమిళ్ స్టార్ హీరో విజయ్ పై జరుగుతోన్న దాడులు అందుకే సంకేతంలా కనిపిస్తున్నాయి. మామూలుగానే పొలిటికల్ రివెంజ్ లకు కోలీవుడ్ ఓ అడ్డగా కనిపిస్తుంది. అలాగని విజయ్ చేసిన దాన్ని సమర్థించడం లేదు. కానీ ఆల్రెడీ పెట్టిన ఐటి కేసులు ఉన్న ఓ స్టార్ పై వాటిని ఎత్తివేశారు. అలా ఎత్తివేసిన మరుక్షణమే ఓ సూపర్ స్టార్ అక్కడి నుంచి బిజెపి విధానాలను సమర్థిస్తూ నిస్సిగ్గుగా కోట్లమంది ప్రజల అభిప్రాయాలను అమ్ముకున్నాడు. ఇప్పుడు అది వ్యతిరేకించినందుకు సడెన్ గా టార్గెట్ అయ్యాడు మరో సూపర్ స్టార్ విజయ్.

నిన్నటి నుంచి తమిళ్ స్టార్ విజయ్ పై ఐటి సోదాలు జరుగుతున్నాయి. ఆయన ప్రతి ఆఫీస్ తో పాటు, అన్ని ఇళ్లలోనూ జరుగుతున్నాయి. వీటికి విజయ్ నుంచి ఏ మాత్రం వ్యతిరేకత కనిపించ లేదు. పూర్తిగా అధికారులకు సహకరించాడు. అతని కుటుంబ సభ్యులు సైతం అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఇదే టైమ్ లో విజయ్ కి మద్ధతుగా తరలి వచ్చిన వేలాది అభిమానులను సైతం అతను బాగా కంట్రోల్ చేశాడు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రియల్ హీరోలా బిహేవ్ చేశాడు. మొత్తంగా తన రీసెంట్ మూవీ బిజిల్ కు లాభాల కోసం అనే పేరుతో సాగిన సోదాలు అనేక అవకతవకలతో మొత్తంగా విజయ్ 65 కోట్లకు లెక్క చెప్పాలి అంటూ తేల్చారు.

పోనీ ఈ సోదాల వల్ల విజయ్ కి వచ్చే ఇబ్బందేమైనా ఉందా.. అంటే ఖచ్చితంగా లేదనే చెప్పాలి. కానీ కొన్నాళ్లుగా అతని ప్రతి సినిమాలోనూ బిజెపి విధానాలపై ఇన్ డైరెక్ట్ సెటైర్స్ ఉంటున్నాయి. కొన్నాళ్ల క్రితం ఏకంగా జిఎస్టీనే టార్గెట్ చేశాడు. తర్వాత ఓటు హక్కు కోసం నినదించాడు. ఇవన్నీ మనసులో పెట్టుకునే ఐటి శాఖను అడ్డుగా పెట్టుకునే ఆ పార్టీ నుంచి ఇలాంటి దాడులు చేయించారు అనేది ఓపెన్ సీక్రెట్. ఒకవేళ విజయ్ వీళ్లు పట్టుకున్న 65 కోట్లకు లెక్క చెబితే మాత్రం ఖచ్చితంగా వాళ్లు తలలు ఎక్కడ పెట్టుకుంటారో.. ఒకవేళ చెప్పలేకపోతే అతను ఫైన్ కడతాడు. అంతకు మించి ఇంకేముంటుందీ..?

Is BJP Government Targeting Tamil actor Vijay,IT Attacks On Vijay,60cr Founded

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here