తెలంగాణలో తగ్గిన కేసులు?

90

తెలంగాణలో ఆదివారం సాయంత్రం ఐదున్నర నాటికి 2,242 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్నటివరకూ మూడువేలకు పైగా ఉన్నకేసులు ఆదివారం తగ్గుముఖం పట్టాయి. అయితే, ఆదివారం ఉదయం నుంచి కేవలం 42,526 టెస్టులు చేశారు. అంతకు ముందు రోజు అంటే శనివారం నాడు 63,120 టెస్టులు చేయగాచ 3,308 కేసులు నమోదయ్యాయి. శుక్రవారమేమో 65,997 టెస్టులు చేయగా 3464 కేసులు నమోదు కావడం గమనార్హం. అంటే సాధారణంగా, టెస్టులు తక్కువ సంఖ్యలో చేసినప్పుడు కేసులు కూడా తక్కువే కనిపిస్తాయి. కాబట్టి, రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పడుతుందనే అంశంలో ఇప్పుడిప్పుడే అంచనాకు రాలేం. ఒకవేళ టెస్టులు పెరిగి, కొత్త కేసులు తగ్గుముఖం పడితే కరోనా తగ్గుతుందని చెప్పొచ్చు. ఇదిలా ఉండగా.. భారతదేశమంతటా చూస్తే.. కొత్త కరోనా కేసులు 2,22,704గా నమోదయ్యాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here