దావుదే ప్రొడ్యూస‌ర్??

Is Dawood RGV Producer?

ఆర్‌జీవీ అంటేనే సంచ‌ల‌నం.. ఆయన సినిమా అంటే ప్రేక్షకుల్లో ఎక్కడ్లేని క్రేజ్. ఒక కాంట్ర‌వ‌ర్సీ స‌బ్జెక్టును ఎంచుకుని.. దాన్ని ఆస‌క్తిక‌రంగా తీర్చిదిద్ద‌డంలో ఆయ‌న‌కు ఆయనే సాటి. అందుకే, ఆర్జీవీ తన సినిమాల పబ్లిసిటీ కోసం పెద్దగా ఖర్చు చేయరు. ఆయన ఎంచుకున్న సబ్జెక్టుల వల్లే రావాల్సినంత పబ్లిసిటీ దానంతట అదే వస్తుంది. ముఖ్యంగా, యూత్ లో ఆయనకు గల ఫాలోయింగే వేరని చెప్పాలి.  తాజాగా, ఆర్జీవీ డి కంపెనీ అనే సినిమా తీస్తున్నారు. గత కొంతకాలం ఆయన గోవాలో మకాం వేసి ఈ సినిమాను కంప్లీట్ చేశారు. అయితే ఈ సినిమా ప్రొడ్యూసర్ ఎవరని అనుకుంటున్నారు?

ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా.. మాఫియా డాన్ దావుద్ ఇబ్ర‌హీమే ఆర్‌జీవీ తీస్తున్న డి కంపెనీ సినిమా ప్రొడ్యూస‌ర్ అని కచ్చితంగా చెప్పొచ్చు‌. ఈ విష‌యం  డి కంపెనీ మూవీ ట్రైల‌ర్ చూడ‌గానే ఇట్టే అర్థ‌మ‌వుతుంది. ఒక‌సారి ఈ ట్రైల‌ర్ ని నిశితంగా ప‌రిశీలిస్తే.. టైటిల్స్‌లో ప్రొడ్యూస‌ర్ అనే టైటిల్ ప‌డిన చోట.. అల్లాహో అక్బ‌ర్ అని బ్యాక్ గ్రౌండ్లో వ‌స్తుంది. వాస్త‌వానికి, ఈ సినిమాను స్పార్క్ మీడియా అధినేత సాగ‌ర్ మ‌చనూరు నిర్మిస్తున్నారు. మ‌రి, ఓ తెలుగు ప్రొడ్యూస‌ర్ పేరు వ‌చ్చేట‌ప్పుడు అల్లాహో అక్బ‌ర్ అని రావ‌డ‌మేమిటి? ఈ సినిమా నిర్మాత దావుద్ ఇబ్ర‌హీమే కాబట్టి.. ప్రొడ్యూస‌ర్ వ‌ద్ద అలా వ‌స్తోంద‌ని అర్థ‌మ‌వుతోంది.

మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. గ‌తేడాది మార్చిలో ఆర్‌జీవీ దుబాయ్ వెళ్లిన‌ప్పుడు ర‌హ‌స్యంగా దావుద్ ఇబ్ర‌హీంని క‌లిసిన‌ట్లు ఇంటెలిజెన్స్ వ‌ర్గాలు అనుమానిస్తున్నాయి. సినిమాలో దావుద్ కి సంబంధించి ఏయే అంశాల్ని హైలైట్ చేయాలి? ఎలాంటి స‌న్నివేశాల‌కు ప్ర‌యార్టీ ఇవ్వాలి? వంటి విష‌యాల‌పై క్షుణ్నంగా చ‌ర్చించిన‌ట్లు స‌మాచారం. మొత్తానికి, ఆ సినిమాలో దావుద్‌ని హీరోగా చూపెట్టేందుకే ఆ ర‌హ‌స్య స‌మావేశం జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. ఆ రోజు ఇద్ద‌రి మ‌ధ్య కుదిరిన ఒప్పందం త‌ర్వాతే డి కంపెనీ సినిమా షూటింగ్ మొద‌లైందని చెప్పొచ్చు.  మొత్తానికి, ఆర్‌జీవీ ఏది చేసినా సంచ‌ల‌న‌మే అవుతుంద‌ని చెప్ప‌డానికి డి కంపెనీ సినిమాయే తాజా ఉదాహ‌ర‌ణ‌. సినిమా విడుద‌ల కాక‌ముందే ఇంత కాంట్ర‌వ‌ర్సీ జ‌రుగుతోంటే, ఇది బ‌య‌టికొచ్చిన త‌ర్వాత ఇంకెంత వివాదం సృష్టిస్తుందో తెలియాలంటే మ‌రికొంత కాలం వేచి చూడాల్సిందే

#D Company Updates

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article