హైదరాబాద్ ఒట్టి చెత్త నగరమా?

Is Hyderabad A Worst City?

భాగ్యనగరం… పేరుకే ఇది భాగ్యనగరం.. కానీ మెట్రో సిటీ అయినా హైదరాబాద్లో ఎక్కడ చూసినా సమస్యలు స్వాగతం పలుకుతాయి. నగర రహదారులు నరకానికి నకలు గా ఉన్నాయి. ఎక్కడ చూసినా పొంగిపొర్లుతున్న డ్రైనేజీ లతో, ముక్కు పుటాలు అదిరి పోయే దుర్గంధంతో పరమ గబ్బు గా కనిపిస్తున్న హైదరాబాద్ ఉత్తమంగా జీవించగల నగరంగా అవార్డు కూడా అందుకుంది. ఇక ఈ అవార్డు అందుకున్నందుకు సంతోష పడాలో, హైదరాబాద్ నగరంలోని పరిస్థితులు చూసి బాధపడాలో అర్థం కాని పరిస్థితి నగర వాసులకు ఉంది.

ఇన్నిన్ని సమస్యలు.. అయినా అవార్డులు?
ఉత్తమ జీవన నగరంగా అవార్డు అందుకున్న హైదరాబాద్ నిర్దేశించి నగరవాసులు చాలా ఘాటుగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఎక్కడపడితే అక్కడ ఆక్రమణలతో, రోడ్లను సైతం ఆక్రమిస్తూ కడుతున్న అక్రమ నిర్మాణాల తో ఉన్న నగరం నిజంగానే గొప్పగా జీవించగల నగరం అని మండిపడుతున్నారు నగరవాసులు. ఇక అంతే కాదు వేలకొద్ది చెరువులను కబ్జా చేసి, అసలు చెరువులే లేకుండా మాయం చేసి ఆ భూములను ల్యాండ్ మాఫియా విక్రయించుకుందని , అలాగే ఎక్కడపడితే అక్కడ స్పీడ్ బ్రేకర్లు, చాలా క్రూరంగా మనుషుల మీద దాడి చేస్తున్న వేల సంఖ్యలో ఉన్న వీధి కుక్కలు, చెవులు చిల్లులు పడేలా వాహన చోదకుల హారన్ శబ్దాలు, నడవటానికి పనికిరాని ఫుట్ పాత్ లు, కనీసం కాసేపు ఆహ్లాదకరంగా లేని జిహెచ్ఎంసి పార్కులు, 90 నుండి 99 శాతం వరకు వాన నీటిని వృధా చేసే పరిస్థితులు, 90 నుండి 99 శాతం వరకు విపరీతంగా జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఎ, రెవిన్యూ శాఖలలో పేరుకుపోయిన అవినీతి.. ఇవన్నీ ఉత్తమ జీవన నగరంగా హైదరాబాదు గొప్పతనాన్ని చెప్పకనే చెబుతున్నాయి. ఇన్ని సమస్యలు తాండవిస్తుంటే హైదరాబాద్ ఉత్తమ జీవన నగరంగా అవార్డు సాధించింది అంటే నగరవాసులు నవ్విపోతున్నారు.

సెలబ్రిటీలు చెబితేనే చేస్తారా?
ఇక అధికారుల పనితీరు పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ ఏదైనా సమస్య ఉందంటే తమ దైనందిన విధుల్లో భాగంగా పనిచేయాల్సిన జిహెచ్ఎంసి అధికారులు అవేమీ పట్టనట్టు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇక నగరంలో సమస్యలపై ఎవరైనా సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెడితే అప్పుడు మాత్రమే స్పందిస్తున్నారు. తాజాగా హరీష్ శంకర్ పెట్టిన పోస్ట్ కు జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ హరిచందన ఐఏఎస్ స్పందించారు. ఒకపక్క నగరమంతా జ్వరాలతో ఇబ్బంది పడుతుంటే మాదాపూర్ జూబ్లీ ఎంక్లేవ్ వద్ద డ్రాయింగ్ లీకేజీ కు సంబంధించిన దృశ్యాలను ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఆయన అధికారులు ఈ సమస్యను పరిష్కరించాలని తన ట్వీట్ ద్వారా పేర్కొన్నారు. ఇక దానికి జోనల్ కమిషనర్ హరి చందన తప్పకుండా అంటూ సమాధానమిచ్చారు. ఎవరో ఒకరు చెప్తే తప్ప, అందులోనూ సినీప్రముఖులు చెప్తే తప్ప అధికారులు పనిచేయడం లేదనేది చాలా క్లియర్ గా అర్ధం అవుతుంది. నగరంలోని ప్రతి డివిజన్లో ఉన్న సమస్యలు పరిష్కరించకుంటే, ఇక అధికారులు ఏం పని చేస్తున్నట్టు అని ప్రశ్నిస్తున్నారు నగరవాసులు. ప్రజాధనాన్ని అధికారుల జీతంగా చెల్లిస్తుంటే, పట్టింపులేనట్టు అధికారులు ప్రవర్తిస్తున్న తీరు ఆగ్రహానికి గురిచేస్తుంది. దున్నపోతు మీద వాన కురిసిన చందంగా నగరం ఎంత గబ్బు గా ఉంటే మాకేంటి అన్నట్టు పట్టి పట్టనట్టు అధికారులు వ్యవహరిస్తున్నా ప్రభుత్వం స్పందించదు. మౌలిక వసతుల కల్పనకు పనిచేయదు కానీ, అవార్డులు రివార్డుల కోసం మాత్రం తెగ తాపత్రయ పడుతుంది.

hyderabad updates

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article