జ‌గ్గారెడ్డి కేటీఆర్ కోవ‌ర్టా?

YS Sharmila made a strong allegation on Sangareddy MLA Jaggareddy. She doubted that, Jaggareddy is a covert of KTR.

వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డిపై ఫైర్ అయ్యారు. జగ్గారెడ్డి కెటిఆర్ కోవర్ట్ అని ఆయన గాంధీ భవన్ భవన్ మొత్తం తెలుసంట క‌దా అని సెటైర్ వేశారు. వైఎస్సార్ నిన్ను పార్టీలోకి పిలిచారని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని.. వైఎస్సార్ పార్టీ మారాడా.. ఎప్పుడు మారాడని ఆమె ప్ర‌శ్నించారు. వైఎస్సార్ గెలిచిన పార్టీ కాంగ్రెస్ లో కలిసి పోయింది క‌దా.. ఆ మాత్రం జ్ఞానం లేకుండా జగ్గారెడ్డి మాట్లాడుతున్నాడ‌ని హేళ‌న చేసింద‌. పార్టీలు మారే ఖర్మ వైఎస్సార్ కి పట్టలేద‌న్నారు. జ‌గ్గారెడ్డిలా పార్టీలు మారి రాజకీయ వ్యభిచారం చేసే సంస్కృతి వైఎస్ఆర్ ది కాద‌ని.. పొద్దున తెరాస, మధ్యాహ్నం బీజేపీ, సాయంత్రం కాంగ్రెస్.. ఎవరు పిలిస్తే అక్కడికి పోతావ‌ని ఎద్దేవా చేశారు. వైఎస్సార్ నీ శీలం కరాబు చేశాడా? పార్టీలు మారినందుకు ఎన్ని సార్లు శీలం దోచుకున్నారు జగ్గారెడ్డి? ఎవరికి కథలు చెప్తున్నవు.. ఒక్కరోజైనా ఒక్క ఎకరాకు నీళ్ళు ఇవ్వలేద‌ని ప్రశ్నించావా.. ఈ సంగారెడ్డి ప్రజలకు కోసం ఒక్క రోజైనా కొట్లాడావా.. తెరాస మంత్రి ఒకరు సంగారెడ్డి నీ దత్తత తీసుకుంటా అన్నారు.. మ‌రి, దత్తత తీసుకున్న తర్వాత అభివృద్ధి ఏది అని కొట్లాడినవా అంటూ విమ‌ర్శించారు.

నీతో లాభం లేని సంగారెడ్డి కి నువు ఎమ్మెల్యే గా ఉంటే ఎంత.. లేకుంటే ఎంత అని అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నావు.. రేపు ఏ పార్టీలో ఉంటావో నీకే క్లారిటీ లేదు.. నువ్వా మా గురించి మాట్లాడేది.. వైఎస్సార్ ను కాంగ్రెస్ పార్టీ గౌరవించడం లేదు.. వైఎస్సార్ చనిపోతే ఎఫ్ఐఆర్‌ లో చేర్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ.. వైఎస్సార్ కు వెన్నుపోటు పొడిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ.. 30 ఏళ్లు సేవ చేయించుకొని వైఎస్సార్ కు వెన్నుపోటు పొడిచారు.. ఇంద్రుడు – చంద్రుడు అని వైఎస్సార్ తో సేవ చేయించుకున్నారు.. కాంగ్రెస్ ను రెండు సార్లు వైఎస్సార్ అధికారంలోకి తెచ్చారు.. మ‌రి వైఎస్సార్ చనిపోయాక 5 ఏళ్లు అధికారంలో ఉంది
అప్పుడు వైఎస్సార్ కి ఏం చేశారు? కాంగ్రెస్ పార్టీతో వైఎస్సార్కి ఘనత రాలేదు.. వైఎస్సార్ తోనే కాంగ్రెస్ పార్టీకి ఘనత అంటూ మండిపడ్డారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article