మహేష్ ను కాదని ప్రభాస్ కు ఎస్ అంటుందా..?

55
kiyara in NTR movie
kiyara in NTR movie
Is kiyara says yes to prabhas?
ఒకప్పుడు స్టార్ హీరోలదే హవా. ఇప్పుడు మార్కెట్ పెరిగింది. పెరిగిన మార్కెట్ ను క్యాష్ చేసుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. అనుకోకుండా కొందరికి మార్కెట్ విస్తరిస్తే.. మరికొందరు తామే పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రెండు విషయాల్లోనూ ఉన్న ప్రభాస్ సైతం తన ప్యాన్ ఇండియన్ మార్కెట్ ను నిలబెట్టుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇందులో భాగంగా ఒకప్పుడు కేవలం హీరో పక్కన ఆడిపాడ్డానికి మాత్రమే ఎక్కువగా ప్రాధాన్యం అనుకున్న హీరోయిన్లకూ ఇప్పుడు రేంజ్ మారింది. వారికీ సెపరేట్ గా మార్కెట్ ఫామ్ అవుతోంది. అంటే ఓ సినిమా బ్లాక్ బస్టర్ లో హీరోయిన్ షేర్ కూడా కౌంట్ అవుతోంది. ఆ హీరోకు ఎంత క్రేజ్ ఉంటుందో దాదాపు అదే రేంజ్ లో కాకపోయినా మాగ్జిమం హీరోయిన్లకూ షేర్ వస్తోంది. ఆ షేర్ తీసుకుని.. షంషేర్ గా బాక్సాఫీస్ ను షేక్ చేయాలని ఇప్పుడు ప్రతి హీరో అనుకుంటున్నాడు. అందుకు సౌత్ హీరోలు అస్సలే మినహాయింపు కాదు. అందుక ప్రస్తుతం బాలీవుడ్ లో సూపర్ క్రేజ్ ఉన్న కియారా అద్వానీ వైపు మన టాలీవుడ్ దృష్టి పెడుతోంది. ప్రభాస్ ‘సర్కారువారి పాట’లో హీరోయిన్ గా కియారాను తీసుకోవాలని అనుకున్నారు. తనకు డేట్సు లేవని చెప్పింది. తర్వాత రామ్ చరణ్, చిరంజీవి కలిసి నటిస్తోన్న ‘ఆచార్య’లో చరణ్ సరసన తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ టైమ్ లో ఇప్పుడు ప్రభాస్ సైతం ఈ ముద్దుగుమ్మపై మనసు పడ్డాడు అంటున్నారు.  ప్రస్తుతం రాధేశ్యామ్ సినిమాతో బిజీగా ఉన్నాడు ప్రభాస్. ఎప్పుడు షూటింగ్ మొదలైతే అప్పటి నుంచి రెగ్యులర్ షూట్ తో వీలైనంత తక్కువ షెడ్యూల్స్ లో ఫినిష్ చేయాలని ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ తో సిద్ధంగా ఉందీ టీమ్. ఆ తర్వాత ప్రభాస్ .. వైజయంతి బ్యానర్ లో నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ఓ సోషియో ఫాంటసీ సినిమాకు ఓకే చెప్పి ఉన్నాడు. ఈ మూవీలోనే కియారాను హీరోయిన్ గా తీసుకోవాలనుకుంటున్నారట. కియారాకు ఇప్పుడు బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. ఇటు ప్రభాస్ కు సైతం బాగానే ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే తను ఉంటే తన ప్యాన్ ఇండియన్ మార్కెట్ కు ప్లస్ అవుతందనే భావనలో ఉందట నాగ్ అశ్విన్ టీమ్. మరి ఇప్పటికే మహేష్ బాబుకు నో చెప్పిన ఈ అధరచుంబనాల సుందరి.. ప్రభాస్ కు ఎస్ చెబుతుందా..? చెబితే మహేష్ ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారు అనేది చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here