నితిన్ నిర్ణయం సరైనదేనా..?

37
is nitin decision right?
is nitin decision right?

is nitin decision right?

యూత్ స్టార్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నితిన్. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా బ్యాక్ ఎండ్ లో ఉన్న స్ట్రాంగ్ బేస్ వల్ల మళ్లీ నిలబడ్డాడు. ఇష్క్ తర్వాత పూర్తిగా కొత్త ఇమేజ్ వైపు వచ్చాడు. అయితే గతంలో లాగానే మళ్లీ యాక్షన్ సినిమాలు చేయాలని చూసినా రిజల్ట్ మారలేదు. వరుసగా ఫ్లాపులు చూస్తున్నాడు. అందుకే మళ్లీ రూట్ మార్చి రొమాంటిక్ ఎంటర్టైనర్ గా భీష్మతో ఆకట్టుకున్నాడు. ఈ మూవీ సూపర్ హిట్ గా నిలవడంతో నితిన్ లో మళ్లీ మునుపటి ఉత్సాహం కనిపిస్తుంది. దాన్ని రంగ్ దే తో రెట్టింపు చేయాలనుకుంటే కరోనా ఆ జోరుకు కాస్త అడ్డుకట్ట వేసింది. అయినా నితిన్ హిట్ ట్రాక్ లో ఉన్నాడు కాబట్టి రంగ్ దే ఎప్పుడు వచ్చినా ఇబ్బంది ఉండదు. పైగా కీర్తి సురేష్ వంటి ప్లస్ ఫ్యాక్టర్ కూడా ఉంది. అందువల్ల రంగ్ దే మరో విజయం ఇవ్వొచ్చనేది టాలీవుడ్ టాక్. రంగ్ దే తర్వాత నితిన్ బాలీవుడ్ బ్లాక్ బస్టర్ అంధదూన్ రీమేక్ చేయబోతున్నాడు. తమ సొంత బ్యానర్ శ్రేష్ట్ మూవీస్ లోనే రూపొందబోతోందీ చిత్రం. మేర్లపాక గాంధీ డైరెక్ట్ చేయబోతోన్న ఈ మూవీలోని టబు చేసిన కీలక పాత్ర కోసం చాలామంది సీనియర్ హీరోయిన్లను అడిగారు. కానీ ఎవరూ ఒప్పుకోలేదు. నయనతార పర్ఫెక్ట్ గా సూట్ అవుతుందనుకుంటే ఆమె ఏకంగా 9కోట్ల రెమ్యూనరేషన్ అడిగింది. దీంతో నితిన్ మళ్లీ టబు వైపే మొగ్గు చూపాడు.

బట్ ఫైనల్ గా ఎవరి ఊహలకు అందకుండా తమన్నాను ఫిక్స్ చేసుకున్నారు. నిజానికి ఇది తమన్నా ఇమేజ్ కు మించిన పాత్ర. టబు ఇమేజ్ కి సరిగ్గా సరిపోయే పాత్ర అది. అలాంటి హీరోయిన్ అయితేనే బావుంటుందనుకున్నారు. కానీ తమన్నా సీన్ లోకి వచ్చింది. అంటే కథలో అత్యంత కీలకమైన సీన్స్ లో భారీ మార్పులు  ఉంటాయని ఊహించొచ్చు. ఇక రాధికా ఆప్టే పాత్రలో నభా నటేష్ ను తీసుకున్నాడు. అమ్మడి గ్లమరస్ ఇమేజ్ కు ఆ పాత్ర ఓకే. కాకపోతే తమన్నా .. టబును మ్యాచ్ చేస్తుందా అనేది పెద్ద డౌట్. అందుకే నితిన్ నిర్ణయం సరైనదేనా అనే డిస్కషన్స్ నడుస్తున్నాయి. విశేషం ఏంటంటే ఏదో ఒక సినిమా అంటూ తమన్నా మాత్రం చాలా బిజీగానే ఉంటోంది. తనకంటే పదేళ్లు వెనక ఇండస్ట్రీకి వచ్చిన సత్యదేవ్ తోనూ ‘గుర్తుందా శీతాకాలం’అనే సినిమాలో నటిస్తోంది. అలాంటి తను అంధాదూన్ రీమేక్ లో ఈ లస్టీ క్యారెక్టర్ చేయడం కాస్త ఆశ్చర్యంగానే ఉంది. మరి తను టబును మరిపిస్తుందా.. లేక తేలిపోతుందా అనేది చూడాలి. ఏదేమైనా ఇన్నాళ్లూ ఇదే పాత్ర కోసం ఆగిన సినిమా ఇంక పట్టాలెక్కుతుందనుకోవచ్చు.

tollywood news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here