సునీల్ ఫేట్ ను వేదాంతం మారుస్తాడా..?

16
Is sunil fate changed?
Is sunil fate changed?

Is sunil fate changed?

వేదాంతం రాఘవయ్య.. కళారంగంలో తెలుగువారందరికీ సుపరిచితమైన పేరు. అనేక రంగాల్లో ఆయన చూపిన ప్రతిభ కళారంగంలో వెలకట్టలేనిదిగా నిలిచిపోయింది. కూచిపూడి కళాకారుడుగా ప్రసిద్ధులైన ఆయన తర్వాత సినిమా రంగంలోకి అడుగుపెట్టి కొరియోగ్రాఫర్ గా దర్శకుడుగా రాణించారు. అలాంటి వ్యక్తి పేరుతో ఓ సినిమా వస్తుందంటే ఖచ్చితంగా బయోపిక్ అనే అనుకుంటాం. కానీ అందుకు పెద్దగా ఆస్కారం లేనట్టుగా కనిపిస్తోన్న కాంబోలో ‘వేదాంతం రాఘవయ్య’ అనే టైటిల్ తో సినిమా అనౌన్స్ కావడం విశేషం. పైగా దీనికి హరీశ్ శంకర్ రచయిత సమర్పకుడు కూడా. సునిల్ ఆ పాత్రలో కనిపిస్తున్నాడు. 14రీల్స్ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ మూవీ టైటిల్ వెనక మార్కర్ తో చెరిపేసిన కరెన్సీ నోట్ కనిపిస్తోంది. దీన్ని బట్టి ఇది రాఘవయ్య గారి బయోపిక్ కాదేమో అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు చాలామంది. మొత్తంగా హీరోగా వేషాల్లేక, కమెడియన్ గా ఎవరూ పట్టించుకోక.. విలన్ గానూ మారి క్యారెక్టర్స్ కోసం కొత్త నటుడులా ఎదురుచూస్తోన్న సునిల్ కు ఇది అనుకోని అవకాశంగానే చెప్పాలి. ఇక ఈ కాంబినేషన్ లో అనౌన్స్ అయిన సినిమా.. పరిశ్రమ అటెన్షన్ ను గ్రాబ్ చేయడంలో సక్సెస్ అయిందనే చెప్పాలి. కాకపోతే ఆడియన్స్ లో ఈ వ్యవహారం ఏ మేరకు డిస్కషన్స్ లోకి వస్తుందనేది డౌట్. కారణం సునిలే. అతను ఇప్పుడున్న సిట్యుయేషన్ లో ఏం చేసినా ఎగ్జైట్మెంట్ అయితే ఉండదు. కాకపోతే మరోసారి వచ్చిన ఈ ‘ప్రధాన పాత్ర’అవకాశాన్ని అతనెలా వాడుకుంటాడు.. అనేది కాస్త ఇంట్రెస్టింగ్ గానే మారింది. మరి ఈ మూవీ అయినా సునిల్ కు ఏదో ఒక దారి చూపుతుందేమో చూడాలి.

tollywood news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here