నేనేం కెలకలేదు – విజయ్ దేవరకొండ

153
Is Vijay Involved In WFL Movie Script?
Is Vijay Involved In WFL Movie Script?

Is Vijay Involved In WFL Movie Script?

ఆ సినిమాలో నేనేం వేళ్లు పెట్టలేదు. అంతా టీమ్ వర్క్.. అంటున్నాడు విజయ్ దేవరకొండ.. అతని రీసెట్ మూవీ వరల్డ్ ఫేమస్ లవర్ భారీ ఫ్లాప్ గా నమోదైనట్టే. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ను 30కోట్ల వరకూ అమ్మేశారు. కానీ  వెనక్కి వచ్చింది. పది కోట్లు మాత్రమే. మహా అయితే మరో రెండు కోట్లు రావొచ్చేమో. అంటే ఎలా చూసినా 18కోట్ల వరకూ నష్టాలు తప్పవు. ఇప్పటికే నిర్మాత చాలా ఆస్తులు అమ్ముకున్నాడు అనే మాటలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు ఈ సినిమా ఫ్లాప్ కు విజయ్ దేవరకొండే కారణం అని కూడా చెబుతున్నారు. అతను వేళ్లు పెట్టడం వల్లే స్క్రిప్ట్ లో చాలా మార్పులు వచ్చాయి. అతను సూచించిన మార్పులే సినిమాకు పెద్ద మైనస్ గా మారాయి అని సినిమా విడుదలైన దగ్గర్నుంచీ వినిపిస్తూనే ఉంది. అయితే ఈ మాటలను విజయ్ కొట్టిపడేశాడు.

తనేమో కథలో వేలు పెట్టలేదని. ఇదంతా టీమ్ వర్క్ అన్నాుడ. బానే ఉంది. కాకపోతే ఆ టీమ్ కు లీడర్ గా దర్శకుడిని పెట్టకుండా తనే ఉన్నాడేమో అనే డౌట్ కూడా వస్తుంది కదూ. ఏదేమైనా ఈ సినిమా విషయంలో విజయ్ దేవరకొండ ఇమేజ్ కు డ్యామేజ్ బాగా జరిగిందనేది నిజం. కారణాలేంటనేది అతనికి మాత్రమే తెలుసు. మరి ఈ డ్యామేజ్ డైలాగ్స్ ను దాటాలంటే నెక్ట్స్ సినిమా మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలవాల్సి ఉంటుంది. లేదంటే అతను ఆరంభ శూరుడుగానే మిగిలిపోతాడు.

Is Vijay Involved In WFL Movie Script?,Reason Behind WFL Flop Talk,World Famous Lover,Vijay Devarakonda,Controversy On Vijay WFL,Tollywood Latest Updates

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here