`గీత గోవిందం` హిందీ రీమేక్

తెలుగులో గ‌త ఏడాది విడుద‌లై సెన్సేష‌న్ క్రియేట్ చేసిన చిత్రం `గీత గోవిందం`. విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్నా జంట‌గా న‌టించిన ఈ చిత్రం ఏకంగా వంద‌కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నార‌ట‌. ఇప్ప‌టికే విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన అర్జున్ రెడ్డిని హిందీలో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ఆ లిస్టులో గీత గోవిందం కూడా చేరింది. ఈ చిత్రంలో ఇషాన్ హీరోగా న‌టించ‌బోతున్నాడ‌ట‌. క‌ర‌ణ్ జోహార్ నిర్మాణంలో జాన్వీక‌పూర్‌తో ద‌ఢ‌క్ చిత్రంలో ఇషాన్ మెయిన్‌లీడ్‌గా న‌టించిన సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లోనే డైరెక్ట‌ర్ ఎవ‌ర‌నేది తెలియ‌నుంది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article