కక్షలో ఎన్ని ఉపగ్రహాలు విజయవంతం అయ్యాయి?

How many satellites have successfully entered orbit?

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఖాతాలో మరో విజయం నమోదైంది. అత్యంత బరువైన జీఎస్ఎల్వీ మార్క్-3 రాకెట్ ను విజయవంతంగా నింగిలోకి పంపింది.ఈ ప్రయోగంలో 36 ఉపగ్రహాలను నిర్ణీత కక్షలోకి చేర్చింది. నెల్లూరు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి అక్టోబర్ 23వ తేదీ అర్ధరాత్రి 12:07 గంటలకు జీఎస్ఎల్వీ నింగిలోకి దూసుకెళ్లింది. ఇస్రో రాకెట్ జీఎస్ఎల్వీ మార్క్-3 ప్రైవేట్ కమ్యూనికేషన్ సంస్థ వన్‌వెబ్‌కు చెందిన 36 ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్లింది.ఇస్రో చరిత్రలో #GSLV రాకెట్ మొదటి సారిగా 6టన్నుల పేలోడ్‌ను మోసుకెళ్లింది. ఇది తీసుకెళ్లిన 36శాటిలైట్లు పూర్తిగా విదేశాలకు చెందినవే. న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అనే సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు వన్‌వెబ్‌కు చెందిన 36శాటిలైట్లను లో ఎర్త్ ఆర్బిట్ (ఎల్ఈఓ)లో ప్రవేశపెట్టింది. మొత్తం 9 బ్యాచ్‌లలో 36 ఉపగ్రహాలు కక్ష్యలోకి చేరాయి. ఒక్కో ఉపగ్రహం 142 కిలోల బరువు ఉంటుంది. ప్రయోగం విజయవంతం కావడంతో ప్రధాని నరేంద్ర మోడీ శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article