కాంగ్రెస్ సీనియర్ నేతల మధ్య ఘర్షణ

Issue in Congress  Leaders .. కేసు నమోదు

కాంగ్రెస్ నేతల తీరు ఏ మాత్రం మారలేదు. గత ఎన్నికల చేదు అనుభవాల తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ నేతల్లో మార్పు రాలేదు. కలిసికట్టుగా ఉండి పోరాటం చేయడం మానేసి ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ గొడవలకు దిగడం కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఉన్నదే. ఇక పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల తీరు ఆ పార్టీని పూర్తిగా అభాసు పాలు చేస్తుంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీభవన్ లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అంబర్ పేటకు చెందిన వి. హన్మంతరావు, శ్రీకాంత్ వర్గీయులు ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు. దీంతో గాంధీభవన్ రణరంగంగా మారింది. ఇటీవల కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతగా నియమితులైన భట్టి విక్రమార్కకు గాంధీభవన్ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అయితే ఈ కార్యక్రమానికి హాజరైన అంబర్‌పేట నియోవర్గ సీనియర్‌ నేత వి. హన్మంతరావు శ్రీకాంత్‌ అనచరులు అడ్డుకున్నారు. శ్రీకాంత్ కు టికెట్ రాకుండా వీహెచ్ అడ్డుకున్నారంటూ ఆరోపిస్తూ ఆందోళనుకు దిగారు. దీంతో వీహెచ్ వర్గీయులు వారిని అడ్డుకోడానికి ప్రయత్నించారు. దీంతో ఇరువర్గీయుల మధ్య ఘర్షణ చెలరేగి ఒకరిపై ఒకరు కుర్చీలను విసురుకున్నారు.
బిసిలకు వీహెచ్ అన్యాయం చేస్తున్నారని ఆరోపిస్తూ శ్రీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అతడిపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ సీఎల్సీ లీడర్ భట్టి చాంబర్ ముందు శ్రీకాంత్ తన అనుచరులతో కలిసి ఆందోళన చేపట్టాడు. వెంటనే వీహెచ్ తనకు క్రమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం వీహెచ్ పై బేగం బజార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇక ఈ గొడవ గురించి వీహెచ్ మాట్లాడుతూ…టికెట్ రానివారంతా ఇలా దాడులకు పాల్పడాలా? అంటూ ప్రశ్నించారు. నాకు కూడా టికెట్ రాలేదు…నేనేం చేయాలి అంటూ ఆవేధన వ్యక్తం చేశారు. ఇలా చేయడం పద్దతి కాదని…ఈ విషయంపై క్రమశిక్షణ కమిటికి ఫిర్యాదు చేస్తానని వీహెచ్ తెలిపారు.
మొత్తానికి గాంధీ భవన్ వేదికగా వీహెచ్ టికెట్ రాకుండా అడ్డుకున్నారని శ్రీకాంత్ వర్గీయులు చేసిన రగడ నేపథ్యంలోనే వివాదం చెలరేగింది. ఇరువర్గాలు ఘర్షణ కు దిగడమే కాకుండా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకునే వరకు వెళ్లారంటే ఇక ఏ స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో గొడవలు జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article