అది క్యాష్ ఫర్ ఓట్.. ఇది క్యాష్ ఫర్ ట్వీట్

IT IS CASH FOR TWEET

  • తప్పు చేయకుంటే ఉలుకుందుకు?
  • చంద్రబాబుకు కేటీఆర్ ప్రశ్న

తెలంగాణ ప్రభుత్వం బురద జల్లేందుకు తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తోందని, ఇందుకోసం కొందరికి డబ్బులిచ్చి ట్విట్టర్ లో అసత్య ప్రచారం చేయిస్తోందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఓటుకు నోటు మాదిరిగానే ట్వీటుకు నోటు కుంభకోణానికి పాల్పడిందని దుయ్యబట్టారు. పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచాల్సిన ఏపీ ప్రభుత్వం దానిని ప్రైవేటు కంపెనీకి చేరవేయడం ద్వారా ప్రైవసీ చట్టానికి తూట్లు పొడిచిందని విమర్శించారు. పైగా ఉల్టా చోర్‌ కొత్వాల్‌ కో డాంటే అన్నట్లు దీనిపై దర్యాప్తు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వంపై చంద్రబాబు విమర్శలు చేయడం దారుణమని ధ్వజమెత్తారు. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఏపీ ప్రజల సమాచారం ప్రైవేటు సంస్థకు అప్పగించడం.. చంద్రబాబు పాత్రను పరోక్షంగా నిర్ధారిస్తోందని, ఈ అంశంలో ఏపీ ప్రజలకు ఆయన సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. దొంగ ట్వీట్లు ఎన్నికల్లో పనిచేయవన్నారు.  ఈ వ్యవహారంలో ఎలాంటి తప్పూ చేయకుంటే చంద్రబాబుకు ఉలుకు ఎందుకని ప్రశ్నించారు. ‘చంద్రబాబూ ఈ వ్యవహారంలో మీరు ఏ నేరం చేయకపోతే ఈ ఉలికిపాటు ఎందుకు? తెలంగాణ పోలీసులకు ఏపీ పోలీసుల అడ్డంకులు ఎందుకు? కోర్టులో తప్పుడు పిటిషన్లు ఎందుకు? విచారణ జరిగితే డేటా దొంగతనం బయటపడుతుందనే కదా మీ భయం’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు. ఏపీలోని 3.5 కోట్ల మందికి సంబంధించిన వ్యక్తిగత గోప్య సమాచారం వారికి తెలియకుండా ప్రైవేటు సంస్థకు చేరినట్లు స్పష్టమైన, పుష్కలమైన సాక్ష్యాధారాలున్నాయని కేటీఆర్ వెల్లడించారు.

AP POLITICS

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article