హెచ్ఎండీఏలో తిమింగ‌లంపై ఐటీ న‌జ‌ర్‌!

* వెయ్యి కోట్ల ఆస్తులు?
* పుర‌పాల‌క శాఖ‌కు పెద్ద దిక్కు
* కేటీఆర్‌కు తెలియ‌దా?
* అర‌వింద్‌కు తెలుసు!
హెచ్ఎండీఏలో ఒక తిమింగ‌లం గురించి జోరుగా చ‌ర్చ జ‌రుగుతోంది. ఇప్ప‌టికే బిల్డర్లు, డెవ‌ల‌ప‌ర్ల‌పై ఈడీ, సీబీఐ, ఐటీ దాడులు జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. తాజాగా, ఐటీ విభాగం ప్ర‌భుత్వంలో ప‌ని చేసే కీల‌క అధికారుల‌పై న‌జ‌ర్ పెట్టిన‌ట్టు స‌మాచారం. ఈ క్ర‌మంలో భాగంగా కేటీఆర్ కు సంబంధించిన మున్సిప‌ల్ విభాగంలో బ‌డా తిమింగ‌లాల‌పై దృష్టి సారించిన ఐటీ విభాగం.. ఒక బ‌డా అధికారి గురించి ఆధారాలు సేక‌రిస్తున్నార‌ని స‌మాచారం. అటు జీహెచ్ఎంసీ, ఇటు మెట్రో రైలు.. మ‌రోవైపు హెచ్ఎండీఏ.. ఇంకోవైపు పుర‌పాల‌క శాఖ‌.. మొత్తానికి ఈ అధికారి చ‌క్రం తిప్పుతున్నాడ‌నే ప్రాథ‌మిక స‌మాచారాన్ని ఇప్ప‌టికే సేక‌రించారు.
హెచ్ఎండీఏ ప‌రిధిలో ఎలాంటి ప్రాజెక్టుకు అనుమ‌తి కావాల‌న్నా.. ఈ తిమింగ‌లాన్ని క‌లిస్తే చాలు.. ప‌ని పూర్త‌వుతుంద‌ని బాహాటంగానే బిల్డ‌ర్లు చెప్పుకుంటారు. గ‌తంలో ఒక‌ట్రెండు సార్లు ఐటీ విభాగం నుంచి త‌ప్పించుకున్న స‌ద‌రు అధికారి.. ఇక త‌ప్పించుకోలేడ‌ని పుర‌పాల‌క శాఖ‌లో చ‌ర్చ జోరుగా జ‌రుగుతోంది. ఈ ఆఫీస‌ర్‌ను ప‌ట్టుకుంటే.. న‌గ‌రానికి ప‌ట్టిన స‌గం ద‌రిద్రం పోతుంద‌ని విమ‌ర్శించే సిబ్బంది ఉన్నారంటే న‌మ్మండి. ఇత‌ని గురించి మంత్రి కేటీఆర్‌కూ తెలుస‌ని.. అయినా ఏం చేయ‌లేక‌పోతున్నార‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. కొన్ని సంద‌ర్భాల్లో పురపాల‌క శాఖ ప్ర‌త్యేక ముఖ్య కార్య‌ద‌ర్శి సైతం ఇత‌ని మీదే ఆధార‌ప‌డ‌టంతో.. స‌ద‌రు అధికారి ఆడిందే ఆట పాడిందే పాట‌గా మారింద‌నే విమర్శ‌లు వినిపిస్తున్నాయి. ఏదీఏమైనా, ఈ తిమింగ‌లం వ‌ద్ద ఎంత సొమ్ము  దొరుకుతుందేమోన‌నే ఆత్రుత‌తో పుర‌పాల‌క శాఖ సిబ్బంది సైతం ఎదురు చూస్తున్నారు.
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article