రియ‌ల్ట‌ర్ల‌పై ఐటీ సోదాలు.. ఆరేళ్లు.. రూ.700 కోట్లు

IT RAIDS ON TWO REALTORS

హైదరాబాద్ నగర శివారు ప్రాంతమైన యాదగిరిగుట్ట, చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఇద్దరు రియల్టర్ల వ్యాపారులపై ఐటి సోదాల్ని నిర్వ‌హించిన‌ట్లు స‌మాచారం. ఈ కంపెనీలు ప్లాటింగ్‌ వెంచర్లతో పాటు అపార్టుమెంట్ల‌ను నిర్మిస్తున్నార‌ని తెలిసింది. సోదాల్లో భాగంగా లెక్కలకు రాని నగదు లావాదేవీలను సూచించే అనేక దోషపూరిత పత్రాలు, చేతితో వ్రాసిన పుస్తకాలు, ఒప్పందాలు మొదలైనవి ఐటి శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రత్యేక సాఫ్ట్‌వేర్ అప్లికేషన్‌తో పాటు ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్ల నుండి డేటాను సేక‌రించారు. ఈ రెండు సంస్థ‌లు రిజిస్టర్డ్ విలువ కంటే ఎక్కువ నగదును అంగీకరిస్తున్నట్లు గుర్తించారు.

లెక్కకురాని నగదు భూమి కొనుగోలు, ఇతర వ్యాపార వ్యయాల డబ్బు చెల్లింపు కోసం ఉపయోగిస్తున్నార‌నే నిర్థార‌ణ‌కు ఐటీ శాఖ అధికారులు వ‌చ్చారు. సోదాల్లో లెక్కకు రాని నగదు రూ. 11.88 కోట్లు, బంగారు ఆభరణాలు రూ. 1.93 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. లెక్కకు రాని నగదు రశీదుల ఆధారంగా వాటి విలువ గత ఆరు సంవత్సరాలుగా రూ. 700 కోట్లుగా ఉన్న‌ట్లుగా అనుమానిస్తున్నారు. తదుపరి దర్యాప్తు జరుగుతుందన్న ఐటీ శాఖ.

 

Hyderabad Realty News Updates

 

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article