ఐటీఐ కోర్సులు షురూ

తెలంగాణ ప్రభుత్వ ఉపాధి, మరియు శిక్షణ శాఖలో గల ప్రభుత్వ మరియు ప్రైవేటు ఐ.టీ.ఐ.లలో 2022 – 2023 /24 విద్యా సంవత్సరానికి గాను వివిధ రకాల ఇంజనీరింగ్ /నాన్-ఇంజనీరింగ్, ఒక సంవత్సరం /రెండు సంవత్సరాల కాల వ్యవధి గల కోర్సులలో,10వ తరగతి పాస్/ఫెయిల్ లేదా 8వ తరగతి పాస్ అయిన అభ్యర్థులు ప్రవేశం పొందుటకు దరఖాస్తు చేసుకోడానికి తేదీ జులై 31, 2022 ఆఖరు గడవని ఎస్‌వీకేనగేష్ జాయింట్ డైరెక్టర్ (ట్రైనింగ్) ప్రకటనలో తేలియజేశారు. దీనికి సంబంధించి అభ్యర్థులు వారి మొబైలు నెంబర్ మరియు ఈమెయిల్ తో రిజిస్ట్రేషన్ చేసుకుని ఒరిజినల్ సర్టిఫికెట్లు ) విద్యా అర్హత, కుల ధ్రువీకరణ,స్టడీ సర్టిఫికెట్, స్థానికత,ఇతర సర్టిఫికెట్లు మరియు తాజా పాస్ పోర్ట్ సైజ్ ఫోటో) స్కాన్ చేసి అప్లోడ్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చని మరియు పూర్తి వివరాలకు http:/ / iti.telangana.gov.in వెబ్ సైటు ను సందర్శించాలని తెలిపారు.

ప్రవేశాల కొరకు దరఖాస్తులను ఆన్ లైన్ లోనే సమర్పించాలని, అభ్యర్థులు ఆసక్తి ఉన్న ఐ.టీ.ఐ/ కోర్సుల ఎంపికలను ప్రాధాన్యత క్రమంలో ఆన్లైన్ లోనే సమర్పించాలని మరియు ఎంపిక విద్య అర్హత మార్కుల మెరిట్ ఆధారంగా ఆన్లైన్ లో వెబ్ కౌన్సెలింగ్ ద్వారా సీటు కేటాయింపు జరుగుతుందని తెలియజేశారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article