మైనార్టీ ఓట్ల కోసం ఎన్పీఆర్ పై జగన్ పాలిటిక్స్…

131
IYR Krishna Rao Comments On Cm Jagan Over NPR
IYR Krishna Rao Comments On Cm Jagan Over NPR
IYR Krishna Rao Comments On Cm Jagan Over NPR
ఏపీలో ఎన్పీఆర్ విషయంలో మైనార్టీలు ఆందోళన వ్యక్తం చేసిన నేపధ్యంలో సీఎం జగన్ తాజాగా తన నిర్ణయాన్ని వెల్లడించిన సంగతి తెలిసిందే . ఒక వైపు ఎన్పీఆర్ కు సహకరిస్తామని చెప్తూనే మరోవైపు అభ్యంతరకరంగా ఉన్న అంశాలను తొలగించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తామని చెప్పారు. 2010జనాభా లెక్కల తరహాలో ఈ సారి కూడా జాతీయ జనాభా పట్టిక రూపొందిచాలని కోరతామని అందుకు అంగీకరించకుంటే అప్పుడు అసెంబ్లీలో వ్యతిరేకంగా తీర్మానం చేస్తామని  చెప్పటం మైనార్టీ వర్గాలకు సంతోషం కలిగించినా జగన్ నిర్ణయంపై బీజేపీ నేతలు మాత్రం భగ్గుమంటున్నారు.

ఎన్.పి.ఆర్ ను తిరస్కరించే అధికారం ఏ రాష్ట్ర ప్రభుత్వానికీ లేదని బీజేపీ సీనియర్ నేత, మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు తెలిపారు. ఎన్.పి.ఆర్ ను అడ్డుకునే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకునే అధికారం కేంద్రానికి ఉందన్నారు.ఏపీలో జాతీయ జనాభా పట్టిక ఎన్.పి.ఆర్ ను ప్రస్తుత ఫార్మాట్ లో అమలు చేయకూడదని నిన్న ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ సీనియర్ నేత, మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు తప్పుబట్టారు. ఎన్.పి.ఆర్ ను అమలు చేయబోమంటూ కొన్ని రాష్ట్రాలు చేస్తున్న ప్రకటనలను ఆయన ఖండించారు. సీఏఏ చట్టం మీద రాష్ట్రాలకు ఎలాంటి అధికారం లేదన్నారు. ఈ విషయం తెలిసి కూడా నాయకులు ప్రజలను ఇంకా మభ్య పెడుతున్నారన్నారు.  ఎన్.పి.ఆర్ ను రాష్ట్రాల్లో అమలు చేసే అధికారం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేసే సెన్సస్ కమిషనర్ కు మాత్రమే ఉందని ఐవైఆర్ కృష్ణారావు తెలిపారు.

ఎన్‌పీఆర్ పౌరసత్వ చట్టం కింద రూపొందించిన రూల్స్ కి అనుగుణంగా ఏర్పాటయింది. ఈ చట్టం మీద రాష్ట్రానికి ఎటువంటి అధికారం లేదు’ అని తెలిపారు.ఇక దీనిని అమలు చేసేది సెన్సెస్ కమిషనర్. సెన్సెస్ చట్టం కింద ఈయన కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే పని చేస్తాడు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సెన్సెస్ పని వరకు ఆయన పరిధిలోనే పని చేస్తారు. సహాయ సహకారాలు అందించడమే కానీ సెన్సెస్ వరకు వారిని నియంత్రించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు’ అని చెప్పారు.లేని అధికారాలు ఉన్నట్లు ప్రకటనలు ఇస్తూ ఈ నాయకులు ప్రజలను మభ్య పెడుతూ ఉన్నారు.

సెన్సెస్ విషయంలో సహకరించకపోతే పౌరుల పైన అధికారుల పైన కూడా క్రిమినల్ చర్యలు తీసుకునే అధికారం సెన్సెస్ కమిషనర్ కు ఉంది. ప్రజలు ఈ అంశాన్ని గ్రహిస్తే రాజకీయ నాయకులు ఎట్లా రెచ్చగొట్టినా సమస్యలకు తావుండదు అని తెలిపారు. జగన్, కేసీఆర్, మమతా బెనర్జీ ఇంకా కొందరు ముఖ్యమంత్రులు తమ మైనారిటీ ఓటు బ్యాంకు పదిలపరచుకోవడం కోసం ఎన్‌పీఆర్ అమలు చేయమంటూ ప్రకటనలు చేస్తున్నారని ఆయన నిప్పులు చెరిగారు.

IYR Krishna Rao Comments On Cm Jagan Over NPR,Muslim Votes,Andhra pradesh , BJP, IYR Krishna Rao, Jagan Govt, YSRCP Govt, NPR, Census

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here