జాను టీజర్ – ఆ ఫీల్ ఏదీ..?

103
Jaanu Teaser Talk
Jaanu Teaser Talk

Jaanu Teaser Talk

96..  2018లో తమిళ్ లో వచ్చిన క్లాస్ మూవీ. ఎంత క్లాస్ అయినా కమర్షియల్ గానూ ఈ సినిమా అద్భుతంగా ఆడింది. అమెజాన్, నెట్ ఫ్లిక్స్ వంటి డిజిటల్ ఫార్మాట్స్ లో అందుబాటులో ఉన్నా.. థియేటర్స్ లో వంద రోజులు పూర్తి చేసుకుని అరుదైన చిత్రంగా నిలిచింది. ఒకరకంగా చెబితే ఇదో సినిమా కాదు. ఓ ఎమోషన్. ప్రతి సీన్ లోనూ ఆ ఎమోషన్ ను అద్భుతంగా నింపాడు దర్శకుడు ప్రేమ్ కుమార్. అలాగే తమ నటనతో ఆ పాత్రల్లోకి వెళ్లిపోయారు విజయ్ సేతుపతి, త్రిష.  అందుకే ఈ సినిమా భాషల కతీతంగా ప్రతి ఒక్కరి హృదయానికి తాకింది. ఓ మ్యాజికల్ మూవీగా నిలిచిపోయింది. ముఖ్యంగా సంగీతం ఈ సినిమాకు ప్రాణంగా నిలిచింది.  అలాంటి చిత్రంపై మనసుపడి తెలుగులో తీయాలనుకున్నాడు నిర్మాత దిల్ రాజు. కొంత ఆలస్యమైనా మొత్తంగా పూర్తి చేస్తున్నాడు. తెలుగులో శర్వానంద్, సమంత జంటగా నటించారు. దీంతో తెలుగులోనూ మంచి సినిమా అవుతుందని చాలామంది భావించారు. కానీ లేటెస్ట్ గా విడుదలైన టీజర్ చూస్తే అలా అనిపించడం లేదు.

96 దర్శకుడు, సంగీత దర్శకుడితోనే తెలుగులోనూ రీమేక్ చేస్తున్నాడు నిర్మాత దిల్ రాజు. ఇక్కడా ఇద్దరూ మంచి ఆర్టిస్టులే. అయినా ఏదో మిస్ అయిన భావన ఈ టీజర్ లో స్పష్టంగా కనిపిస్తోంది. టీనేజ్ క్యారెక్టర్స్ లో తమిళ్ లో నటించిన అమ్మాయినే తీసుకున్నారు. శర్వాకు కుర్రాడి పాత్ర బానే సెట్ అయింది. కానీ 96 మూవీలో ఏదైతే ఎమోషనల్ ఫీలింగ్ ఉంటుందో.. అది ఏ మాత్రం కనిపించలేదీ టీజర్ లో. దీంతో ఈ సినిమాను తెలుగులో చూడాలి.. ఆ ఎమోషన్ ను మన మాటల్లో వింటూ అనుభవించాలి అనుకున్నవాళ్లకు నిరాశ తప్పేలా కనిపించడం లేదు అనిపిస్తోంది.
నిజానికి 96లాంటి చిత్రాలు ఒన్ టైమ్ వండర్స. వాటిని టచ్ చేయకపోవడమే మంచిది. ఇప్పటికే కన్నడలో కూడా ఈ మూవీ రీమేక్ అయింది. అక్కడా సేమ్.. ఎఫర్ట్ బావుంది. కానీ ఆ ఎమోషన్ రిపీట్ కాలేదు అనే టాక్ తెచ్చుకుంది. బహుశా తెలుగులోనూ అదే టాక్ రావొచ్చేమో

Jaanu Teaser Talk,Jaanu Movie Teaser Review,Telugu remake of ’96’ titled ‘Jaanu,Vijay Sethupathi,Trisha,Sharwanand

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here