సమంత కంటే శర్వానంద్ కే కీలకం

Jaanu Will Helps Sharvanand

నటుడుగా శర్వానంద్ టాలెంట్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఇప్పుడంటే టాలీవుడ్ వైవిద్యమైన సినిమాలు అంటోంది కానీ.. అవి కెరీర్ ఆరంభంలోనే చేశాడు శర్వా. అందుకే అతనికి తెలుగులో ప్రత్యేకమైన ఇమేజ్ వచ్చింది. తర్వాత రన్ రాజా రన్ తో రెగ్యులర్ కమర్షియల్ హీరోగా మారాడు. ఆ కోవలో కొన్ని విజయాలు కూడా అందుకున్నాడు. కానీ తర్వాత ఆ రొటీన్ అనే ముద్ర అతనికీ పడింది. మహానుభావుడుగా ప్రయత్నించినా.. రాధలా లాఠీ పట్టినా కలిసి రాలేదు. ఆ తర్వాత టాలెంటెడ్ అనిపించుకున్న దర్శకులు హను రాఘవపూడి దర్వకత్వంలో చేసిన ‘పడి పడి లేచె మనసు’, సుధీర్ వర్మతో చేసిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘రణరంగం’ డిజాస్టర్స్ అనిపించుకున్నాయి. ఆ తర్వాత చేసిన సినిమానే ఈ ‘జాను’.

తమిళ్ బ్లాక్ బస్టర్ 96కు రీమేక్ గా వస్తోన్న ఈ మూవీలో శర్వా సరసన సమంత నటించింది. రెగ్యులర్ సినిమాలకు భిన్నమైన కథ, కథనాలతో వస్తోన్న ఈ మూవీ రేపు విడుదల కాబోతోంది. అయితే వరుస ఫ్లాపుల తర్వాత శర్వానంద్ చేసిన సినిమా కాబట్టి ఈ మూవీ విజయం అతనికే కీలకంగా మారింది. ఈ మూవీతో ఖచ్చితంగా హిట్ అందుకోవాల్సిందే అనేలా ఉన్నాడు. కానీ వరస చూస్తోంటే అలా అనిపించడం లేదు. అందుకే ముందు నుంచీ శర్వా ఈ మూవీ క్రెడిట్ అంతా సమంతదే అంటూ ప్రచారం చేస్తూ వస్తున్నాడు. అంటే సినిమా పోయినా తనదే బాధ్యత అని ఇన్ డైరెక్ట్ గా చెబుతున్నట్టు అనుకోవచ్చు. అయితే ఈ సినిమా పోయినా సమంతకు వచ్చే నష్టం ఏమీ లేదు. అందుకే తనకంటే ఇది శర్వానంద్ కే అత్యంత కీలకం అని చెప్పాలి. మరి ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడో చూడాలి.

Jaanu Will Helps Sharwavanand,#Jaanu,#Samantha,Tamil 96 Remake

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article