జగన్ మాటలు.. దొంగ ప్రాజెక్టులు

131
Telangana Minister Jagadish ReddyJagadish Reddy comments on Jagan
Jagadish Reddy comments on Jagan

Jagadish Reddy comments on Jaganవైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాటలు ఆయన అపరిపక్వతను బయట పెడుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఎద్దేవా చేశారు. వారు చేస్తున్న మోసాలకు ఆ మాటలు అద్దం పడుతున్నాయని ఆయన తేల్చిచెప్పారు. దొంగ ప్రాజెక్టులు నిర్మించింది వారే ఇప్పుడు నిర్మిస్తుంది వాళ్లే అని ఆయన మండిపడ్డారు. ఈ మేరకు శుక్రవారం రోజున ఆయన మీడియాతో మాట్లాడుతూ లేని హక్కులు ఉన్నట్లు చూపిస్తున్నారని ఆయన ఆరోపించారు. మంచినీళ్ళ కోసం అలమటించింది ఆంధ్రోళ్ల పాలనలోనే అని ఆయన విమర్శించారు. చంద్రబాబు నుండి వైఎస్ వరకు తెలంగాణా కు ద్రోహం తలపెట్టిన వారే నని, ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి కూడ అదే బాటలో పయనిస్తున్నారన్నారు. కృష్ణా గోదావరిలో తమ వాటాను వదులుకునే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రా సర్కార్ దుర్మార్గాన్ని ముమ్మాటికీ ఎండ గట్టి తీరుతామని జగదీష్ రెడ్డి తేల్చి చెప్పారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here