కేంద్ర వైఖరి మోసపూరితం

హైదరాబాద్:విద్యుత్ సంస్కరణలపై కేంద్రం వెనకడుగు అంటూ వస్తున్న కథనాలపై మంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు. మంత్రి మాట్లాడుతూ కేంద్రం వైఖరిముమ్మాటికి మోసపురితమే. ప్రజల్లో వ్యతిరేకతను గుర్తించిన మీదటనే ఆ లీకేజీలు. సంస్కరణలపై ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రానికి లేఖ ద్వారా తెలిపారు. వ్యవసాయ చట్టాలను మళ్ళీ పెడతామంటూ బిజెపి నేతలు పేర్కొంటున్నారు. విద్యుత్ సంస్కరణల అంశంలోనూ కేంద్రం అదే వైఖరితో ఉందని అన్నారు.
సంస్కరణలలో మార్పులు మా దృష్టికి రాలేదు. వచ్చాక పరిశీలించి ప్రజల గొంతుకకు అనుగుణంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం ఉంటుంది. విద్యుత్, వ్యవసాయ చట్టాలు దేశ ప్రజలకు గొడ్డలి పెట్టు లాంటివని మంత్రిఅన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article