jagan about daggupati family
వైసీపీ ఎమ్మెల్యే బాలినేని, దగ్గుపాటి పురంధరేశ్వరి పై కొన్ని ఆశ్చర్యకరమైన వాఖ్యాలు చేశారు. అయితే దగ్గుపాటి దంపతులు ఇద్దరు కూడా వేర్వేరు పార్టీలో ఉండటం సరి కాదని, అందుకనే దగ్గుబాటి వెంకటేశ్వర్ రావు కూడా పార్టీ మారే యోచనలో ఉన్నారని అప్పట్లో ప్రచారం జరిగింది. అందుకనే వైసీపీ అధినేత తనని తన పదవి నుండి తొలగించారని ప్రచారం కూడా జరిగింది. కానీ వైసీపీ నాయకులు చెబుతున్న విషయాల ప్రకారం… భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకే పార్టీ లో ఉంటె బాగుంటుందని, అందుకనే పురందేశ్వరి వైసీపీలోకి వస్తే ఆమెను సాదరంగా ఆహ్వానిస్తామని, ఆమెకి ఒక మంచి స్థానాన్ని కల్పిస్తామని జగన్ అభిప్రాయపడ్డారని సమాచారం. అయితే ఈ విషయాన్నీ వైసీపీ ఎమ్మెల్యే బాలినేని వెల్లడించారు. రాజ్యసభ సభ్యురాలిగా ఆమెకు అవకాశం ఇస్తామని చెప్పారని టాక్ వినిపిస్తుంది. అయితే ప్రస్తుతానికి దగ్గుబాటి వెంకటేశ్వరరావు పరుచూరు ప్రాతంలో వైసీపీ పార్టీ ఇన్ ఛార్జిగా ఉన్నారు. అయితే తనని ఆ పదవి నుండి తొలగించారని వచ్చునటువంటి వార్తల నేపథ్యంలో దగ్గుబాటి అనుచరులు నేడు వైసీపీ నేత బాలినేనిని కలుసుకొని, దగ్గుబాటిని ఆ పదవి నుండి తొలగించొద్దని కోరుకున్నారు. ఇక తాజా పరిణామాల నేపధ్యంలో దగ్గుపాటి నిర్ణయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.
TAGS : purandhareshwari, daggupati venkateshwarao, ycp, bjp, party change, parchuru