గవర్నర్ తో జగన్ దంపతుల లంచ్

Jagan and Bharathi Lunch with Governor

ఏపీ సీఎం జగన్ తన అర్ధాంగి భారతితో కలిసి రాజ్ భవన్ కు వెళ్లారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో భేటీ అయ్యారు. ఈ లంచ్ మీటింగ్ లో సీఎం జగన్ రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలను గవర్నర్ కు వివరించారు. ముఖ్యమంత్రి కార్యాలయం రాజ్ భవన్ లో ముఖ్యమంత్రి జగన్ గవర్నర్ ను కలిసేందుకు అప్పాయింట్ మెంట్ కోరింది. వెంటనే గవర్నర్ బీబీ హరిచందన్ సతీ సమేతంగా లంచ్ కు రావాలని ఆహ్వానించారు. దీంతో..ముఖ్యమంత్రి దంపతులు రాజ్ భవన్ లో గవర్నర్ దంపతులతో కలిసి విందు స్వీకరించారు. ఆ తరువాత రాష్ట్రంలో నెలకొన్ని తాజా పరిస్థితులు..ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు..ప్రతీ అంశం వివాదాస్పదం అవుతున్న తీరు గురించి వివరించినట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో గతంలో ఎన్నడూ లేని విధంగా వస్తున్న మతపరమైన విమర్శల వెనుక వాస్తవాలను గవర్నర్ కు నివేదించినట్లు సమాచారం. ఇక, ఇదే సమయంలో పలు యూనివర్సిటీలు..ఏపీపీఎస్సీ ఛైర్మన్ వ్యవహారం పైన చర్చ జరిగినట్లు విశ్వసనీయ సమాచారం.త్వరలో ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలు, అమలు చేస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఇసుక, ఇంగ్లీష్ మీడియం వ్యవహారాలపైనా గవర్నర్ తో సీఎం జగన్ చర్చించారు. ఈ భేటీ దాదాపు గంటకు పైగా సాగింది. అంతకుముందు సీఎం జగన్ దంపతులకు గవర్నర్ బిశ్వభూషణ్ సాదరంగా స్వాగతం పలికారు. మొత్తానికి గంట పాటు గవర్నర్ తో సీఎం దంపతుల భేటీ జరిగింది.

tags : andhrapradesh, cm jagan, ys jagan mohan reddy, governor, biswabhushan hari chandan, lunch meet

దివాలా దిశగా లింగమనేని ఎస్టేట్స్

ఇంగ్లీష్ మీడియంపై టీడీపీ వర్సెస్ వైసీపీ

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *