ప్రజా వేదిక కూల్చేస్తామన్న సీఎం జగన్

Spread the love

Jagan Demolishing the PRAJA Vedhica

ప్రజావేదికపై అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ప్రజావేదిక అక్రమ కట్టడమని ఈనెల 26న అంటే బుధవారం ప్రజావేదికను కూల్చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఉండవల్లిలోని ప్రజావేదికలో కలెక్టర్ల సదస్సులో పాల్గొన్న సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజావేదికపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కరకట్టపై ప్రజావేదిక అక్రమ కట్టడమని తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా కరకట్టపై అక్రమ కట్టడాలను కూల్చివేస్తామని బుధవారం మాత్రం ప్రజావేదికను కూల్చబోతున్నట్లు స్పష్టం చేశారు.

ప్రజావేదిక కూల్చివేస్తామని సీఎం వైయస్ జగన్ ప్రకటించడంపై తెలుగుదేశం పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రజావేదిక కూల్చివేస్తాననడం సరికాదంటున్నారు టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్యచౌదరి. ప్రజావేదిక ప్రజల అవసరాల కోసం నిర్మించిన భవనం అంటూ చెప్పుకొచ్చారు. కూల్చేస్తామని ప్రకటన చేసిన సీఎం జగన్ ప్రజావేదికలో ఎందుకు సమావేశం పెట్టారో చెప్పాలని నిలదీశారు. కరకట్టపై అనేక కట్టడాలు ఉన్నాయని వాటన్నింటిని తొలగిస్తారా అంటూ జగన్ ను ప్రశ్నించారు గోరంట్ల బుచ్చయ్యచౌదరి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *