తండ్రి బ‌యోపిక్‌లో జ‌గ‌న్‌

Jagan is on YSR BIOPIC

వైఎస్ఆర్‌సిపి పార్టీ అధ్య‌క్షుడు వై.ఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి సినిమాలో న‌టించారు. ఇంత‌కు ఏ సినిమాలో అని అనుకుంటున్నారా? ఆయ‌న తండ్రి బ‌యోపిక్ `యాత్ర‌`లో.. వై.ఎస్‌.రాజ‌శేఖ‌ర్ రెడ్డి బ‌యోపిక్‌ను `యాత్ర‌` పేరుతో తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. మహి వి.రాఘ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ చిల్లా, శ‌శిదేవి రెడ్డి నిర్మాత‌లుగా రూపొందుతోన్న ఈ సినిమాలో వై.ఎస్‌.పాద‌యాత్ర గురించి ప్ర‌ముఖంగా సినిమా ఉంటుంది. మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్ మ‌మ్ముట్టి ఇందులో వై.ఎస్‌.ఆర్ పాత్ర‌లో న‌టించారు. వై.ఎస్‌.జ‌గ‌న్ పాత్ర‌లో ఎవ‌రు న‌టిస్తార‌నే దానిపై అప్ప‌ట్లో సూర్య‌, కార్తిల పేర్లు ప్ర‌ముఖంగా విన‌ప‌డ్డాయి. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం వై.ఎస్‌.జ‌గ‌న్ పాత్ర‌లో ఆయ‌నే న‌టించార‌ట‌. ఆయ‌న పాత్ర‌కు సంబంధించిన చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింద‌ట‌. వై.ఎస్‌.జ‌గ‌న్ తొలిసారి `యాత్ర` సినిమాలో న‌టించారు. ద‌ర్శ‌క నిర్మాత‌లు అడ‌గ్గానే పాజిటివ్‌గా స్పందించిన జ‌గ‌న్ వెంట‌నే సినిమా చేశార‌ట‌.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article