ఏపీ అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ ను పొగడ్తలతో ముంచేసిన జగన్

Jagan Praised KCR in AP Assembly

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలిరోజున సభలో తెలంగాణా సీఎం కేసీఆర్ ను పొగిడారు ఏపీ సీఎం జగన్ . సభ ప్రారంభం కాగానే కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి సిఎం జగన్ ఎందుకు వెళ్లారని తెలుగు దేశం ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్న సభలో కేసీఆర్ కు ప్రశంశల వర్షం కురిసే దాకా వెళ్ళింది. తాను వెళ్లకున్నా కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభం అయ్యేదని చెప్పిన జగన్ తాను చేసిన పనిని సంర్ధించుకుని మాట్లాడారు. ఇక కేసీఆర్ ఔదార్యం గొప్పదని చెప్పి సభా ముఖంగా ఆయన తెలంగాణా సీఎం కేసీఆర్ కు కితాబిచ్చారు.

ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో సీఎం కేసీఆర్ తో జగన్ స్నేహం గురించి వ్యాఖ్యలు చేసారు . గతంలో జగన్ కెసిఆర్ ను హిట్లర్ అని పిలిచారని, కాళేశ్వరం ప్రాజెక్టుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో పాకిస్తాన్ అవుతుందని అన్నారు. మరి ఇప్పుడు కేసీఆర్ తో చెట్టాపట్టాలేసుకు తిరగటంలో అంతర్యం ఏమిటని ప్రశ్నించారు . నీటి వనరుల కేటాయింపు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న పెద్ద సమస్య అని టిడిపి దీనికి పరిష్కారం చూపడానికి నిరంతరం ప్రయత్నించిందని పేర్కొన్నారు . మనకు సొంతంగా ఉన్న అవకాశాలను వదులుకుని పక్క వారి దయా దాక్షిణ్యాల మీద ఆధారపడటం శ్రేయస్కరం కాదని చంద్రబాబు పేర్కొన్నాయి. ఇక దానికే జగన్ కేసీఆర్ ను మాగ్నానిమిటీ ని గురించి చెప్తూ అందరూ షాక్ అయ్యేలా పొగడ్తల వర్షం కురిపించారు .

కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి వెళుతున్న జగన్ తన వైఖరిని సమర్థించుకుంటూనే తెలంగాణ సిఎం కెసిఆర్ ను ప్రశంసించారు. పొరుగు రాష్ట్రాలతో మంచి సంబంధాలు కొనసాగించడానికి, తాను తెలంగాణకు వెళ్ళానన్నారు జగన్ . వాస్తవానికి గోదావరి నది నీటిని నాగార్జున సాగర్ మరియు శ్రీశైలం ప్రాజెక్టులకు మళ్లించనున్నట్లు కెసిఆర్ చెప్పారు , ఇది కేవలం తెలంగాణ జిల్లాలకు మాత్రమే కాకుండా, రాయలసీమకు మరియు మరో నాలుగు ఆంధ్రప్రదేశ్ జిల్లాలకు మేలు చేకూర్చే నిర్ణయం కాబట్టి నేను కేసీఆర్ తో సఖ్యంగా ఉండాలని అనుకుంటున్నాను అని పేర్కొన్నారు . అంతే కాదు కేసీఆర్ గొప్పవాడు, ఆయనది పెద్ద మనసు అని జగన్ ప్రశంసించారు . ఏపీ రాష్ట్రప్రజల కోసం,ఏపీకి నీరు ఇవ్వటం కోసం కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలను మెచ్చుకోవటానికి బదులుగా, ఏపీకి ఇప్పుడు మేలు జరుగుతుంది అని సంతోషించటానికి బదులుగా విమర్శలు చేస్తారా అని టీడీపీపై మండిపడ్డారు జగన్ . ఎగువ రాష్ట్రాలు ఒకదాని తరువాత ఒకటి ప్రాజెక్ట్ లు నిర్మిస్తున్నా, టీడీపీ అధికారంలో ఉన్న సమయంలోనే కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం ప్రారభించినా అప్పుడు టీడీపీ ఏం చేసిందని ఇప్పుడు మమ్మల్ని ప్రశ్నిస్తుంది అని మండిప డ్డారు. ఏపీ సీఎం జగన్ కేసీఆర్ ఉదార స్వభావంగల నాయకుడని ఏపీ అసెంబ్లీ సాక్షిగా పేర్కొన్నారు. ఇక ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాలను స్నేహపూర్వక వాతావరణంలో పరిష్కరిస్తామని చెప్పి కోర్టుల్లో తేల్చుకోవటానికి స్వస్థి చెప్తామని పేర్కొన్నారు జగన్ .

JAGAN & KCR

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article