సొంత పార్టీ పై జగ్గారెడ్డి సంచలనం

Jagan Reddy Sensational Decision… సీఎల్పీ కోసమేనా

వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ అయిన కాంగ్రెస్ పార్టీ నేత సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సొంత పార్టీపైనే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకపక్క సీఎల్పీ లీడర్ గా తనకు అవకాశం ఇవ్వాలని కోరినా ఆయన కాంగ్రెస్ పార్టీలో అన్ని లాబీయింగ్ రాజకీయాలను మండిపడ్డారు.
తెలంగాణ కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలు కాంగ్రెస్ పార్టీని టెన్షన్ పెడుతున్నాయి.
కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తాజాగా సొంతపార్టీపైనే తీవ్ర ఆరోపణలు చేశారు. జాతీయ పార్టీ కాంగ్రెస్ లో స్థానికంగా బలమున్న నాయకులకు కాకుండా డిల్లీలో బలమున్న నాయకులకే గుర్తింపు వుంటుందని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలై ఇప్పటికే బలహీనపడ్డ తెలంగాణ కాంగ్రెస్‌….లాబీయింగ్ ద్వారానే సీఎల్పీ ఎన్నిక జరిగితే మరింత నష్టపోవడం ఖాయమని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు.
రాష్ట్రంలో జరిగే రాజకీయ పరిణామాలు స్థానిక నాయకులకు తెలుస్తాయి కానీ డిల్లీ నాయకులకెలా తెలుస్తాయని జగ్గారెడ్డి ప్రశ్నించారు. కానీ నిర్ణయాలు మాత్రం డిల్లీ స్థాయిలో
జరుగుతాయని…అందువల్ల లాబీయింగ్ చేసే నాయకులు మాటలే అదినాయకత్వం దృష్టికి వెళతాయని అన్నారు. ప్రస్తుతం తెలంగాణలో జరిగే పరిణామాలేవీ రాహుల్ కు తెలియవని జగ్గారెడ్డి వెల్లడించారు.
ఇకనైనా కాంగ్రెస్ పార్టీ డిల్లీలో జరిగే లాబీయింగ్ రాజకీయయాలకు స్వస్తి పలికి…స్థానిక పరిస్థితులను అనుసరించి నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. అలా చేస్తేనే పార్టీ కోసం పనిచేసే నాయకులకు అవకాశాలు, గుర్తింపు లభిస్తాయని జగ్గారెడ్డి పేర్కొన్నారు.
గజ్వేల్ కాంగ్రెస్ నాయకులు వంటేరు ప్రతాప్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరడంపై కూడా జగ్గారెడ్డి స్పందించారు. ఆర్థిక ఇబ్బందులు, కోర్టు కేసుల కారణంగానే అతడు కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ లో చేరుతున్నారని తెలిపారు. ఇలా నాయకుల బలహీనతలను గుర్తించి టీఆర్ఎస్ పార్టీ వారిని ఆకర్షిస్తోందిని జగ్గారెడ్డి తెలిపారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article