జగన్ నిర్ణయంతో షాక్ లో మంత్రులు, ఎమ్మెల్యేలు

JAGAN SHOCKING DECISION

వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. వైసిపి ఎమ్మెల్యేలకు, మంత్రులకు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అటెండెన్స్ వేయాలని ఆయన సొంత పార్టీ నేతలకే షాక్ ఇస్తూ డిసిషన్ తీసుకున్నారు. ఇక ఈ బాధ్యతను చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి కి అప్పగించారు.

ఏపీలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రతిరోజు సభలో ప్రతిపక్ష టీడీపీ, అధికార వైసీపీ ల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఒకరిమీద ఒకరు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. అసలు దొరికిన చోటల్లా తిట్టిపోస్తున్నారు. ప్రతి చిన్నదానికి నానా రాద్ధాంతం చేస్తున్నారు. 23 ఎమ్మెల్యేలున్నా టిడిపి ఏమాత్రం తగ్గకుండా వైసీపీ పై ఎదురు దాడికి దిగుతుంది.
ఇక దీంతో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రతిపక్ష టీడీపీ పై మరింత దూకుడుగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. సభలో చర్చ జరుగుతున్న సమయంలో, టీడీపీ విమర్శలు చేస్తున్న సమయంలో వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు తక్కువ సంఖ్యలో సభలో ఉండటం గమనించిన జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు ఈరోజు నుంచి వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులకు తప్పనిసరిగా అటెండెన్స్ వేయాలని కీలక నిర్ణయాన్ని తీసుకున్న జగన్ ఆ బాధ్యతను చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి కి అప్పగించారు.

వైసీపీకి చెందిన ప్రతి సభ్యుడు ఏ సమయానికి సభకు వస్తున్నారు. సభ నుంచి వెళ్లిపోతున్నారు అన్ని అంశాలను ప్రతిరోజు నమోదుచేసి తనకు నివేదిక అందజేయాలని వైయస్ జగన్మోహన్ రెడ్డి చీఫ్ విప్ కు ఆదేశాలు జారీ చేశారు. ప్రతిరోజు సభ్యుల హాజరు పై తనకు ఏరోజుకారోజు నివేదిక అందించాలని ఆయన తెలిపారు. సభలో టీడీపీ బలం చాలా తక్కువగా ఉన్నప్పటికీ వారు వైసిపి ధాటిని ధీటుగానే ఎదుర్కొంటున్నారు. దీంతో టిడిపి విమర్శలు చేస్తున్న సమయంలో వైసీపీ నేతలు ఉండటం లేదన్న విషయాన్ని గ్రహించిన జగన్ మంత్రులకు, ఎమ్మెల్యేలకు అటెండెన్స్ వేయాలని నిర్ణయం తీసుకున్నారు. జగన్ నిర్ణయంతో ఏదో టైం పాస్ కి అసెంబ్లీ కి వస్తున్నాము అనుకునే మంత్రులకు, ఎమ్మెల్యేలకు చెక్ పడే అవకాశముంది.

AP POLITICS

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article