మంత్రులు, ఎమ్మెల్యేలకు జగన్ వార్నింగ్

211
JAGAN WARNING TO LEADERS
JAGAN WARNING TO LEADERS

JAGAN WARNING TO LEADERS

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల సమరానికి రంగం సిద్ధమవుతోంది. మార్చి నెలాఖరులోగా ఎన్నికలు నిర్వహించాలని జగన్ సర్కారు యోచిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయం సొంతం చేసుకున్న వైఎస్సార్ సీపీ.. మున్సిపల్ పోరులోనూ అదే జోరు కొనసాగించాలని భావిస్తోంది. మొన్నటి ఎన్నికల్లో ఓటమి  చవిచూసిన తెలుగుదేశం పార్టీ.. ఈ ఎన్నికల్లో గెలవడం ద్వారా పూర్వ వైభవం సంతరించుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది. జనసేన సైతం తన ప్రభావం చూపించాలని కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో స్థానిక పోరులో గెలుపు సాధించి తీరాల్సిందేనని సీఎం జగన్ పార్టీ నేతలకు స్పష్టంచేశారు. ఈ విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ బాటలోనే ఆయన సాగుతున్నట్టు తెలుస్తోంది.

తెలంగాణలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించే బాధ్యతను మంత్రులు, ఎమ్మెల్యేలకే కేసీఆర్ అప్పగించారు. ఎన్నికల్లో వారి పనితీరును బట్టే భవిష్యత్తులో పదవులు ఉంటాయని స్పష్టంచేశారు. దీంతో వారంతా అత్యంత పకడ్బందీగా వ్యవహరించారు. దీంతో గులాబీ పార్టీ తిరుగులేని విజయం నమోదు చేసింది. తాజాగా జగన్ సైతం అదే పంథా అనుసరిస్తున్నారు. మున్సిల్ పోరు బాధ్యతలను మంత్రులు, ఎమ్మెల్యేలకే అప్పగించారు. పార్టీని గెలిపించనవారికే పదవులు ఉంటాయని వార్నింగ్ కూడా ఇచ్చారు. అసలే మంత్రులపై రెండున్నరేళ్ల నిబంధన ఒకటి మెడపై కత్తిలా కనిపిస్తోంది. ఈ ఎన్నికల్లో కాస్త అటూ ఇటూ అయితే, ఆ రెండున్నరేళ్లు కూడా అమాత్య పదవి ఉండదేమోననే టెన్షన్ వారిని వెంటాడుతోంది. దీంతో క్షేత్ర స్థాయిలో తీవ్రంగా కష్టపడుతున్నారు. మరోవైపు జగన్ తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వచ్చి 9 నెలలు పూర్తవుతోంది. ఈ కాలంలో కొన్ని సంక్షేమ పథకాలను కూడా బాగానే అమలు చేశారు. అయినప్పటికీ, క్షేత్ర స్థాయిలో పార్టీ పరిస్థితులు అంతగా బాగోలేదనే ఫీడ్ బ్యాక్ అందుతోంది. ముఖ్యంగా ఇసుక కొరత ఒకటి మొన్నటి వరకు ప్రభావం చూపించగా.. తాజాగా పించన్ల కోతపై వ్యతిరేకత కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ అవాంతరాలను జగన్ ఎలా ఎదుర్కొంటారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here