Jagan Will meet KCR Soon … ఎక్కడో తెలుసా
టిఆర్ఎస్ అధినేత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ లోని ప్రతిపక్షనేత వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి త్వరలో కలవబోతున్నారు… ఇక టిడిపి అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ను ఇద్దరు కామన్ శత్రువుగా భావిస్తున్న నేపథ్యంలో వీరి కలయిక ప్రాధాన్యతను సంతరించుకుంది. ఒకపక్క ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతుంటే మీరు ఎందుకు కలుస్తున్నారు అన్న ఆసక్తి కలుగుతుంది. ఇక గులాబీ బాస్ కెసిఆర్ ఏపీ రాజకీయాల్లో వేలు పెడతాం అని చెప్పిన నేపథ్యంలో ఇద్దరూ కలిసి చంద్రబాబు ను ఓడించడానికి వ్యూహాలు రచిస్తున్నారని ఆలోచన సైతం కలుగుతుంది. ఇంతకీ అసలు జగన్ కేసీఆర్ ని ఎందుకలా ఉన్నారు? ఎక్కడ కలవనున్నారు అంటే
ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ రాజకీయాల్లో చక్రం తిప్పడానికి ఏర్పాటుచేసిన ఫెడరల్ ఫ్రంట్ సక్సెస్ కోసం ఒక మహాయాగాన్ని చేయడానికి తలపెట్టారు. కెసిఆర్ ఫాం హౌస్ లో యాగానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. మహారుద్ర సహిత సహస్ర చండీయాగం నిర్వహించబోతున్న కెసిఆర్ శారదా శక్తిపీఠం పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి ఆశీర్వాదం మేరకు నిర్వహించబోతున్నారు. అయితే ఇటీవల తిరుమల పర్యటనలో భాగంగా స్వరూపానంద స్వామి ని కలిసిన జగన్ ఆయనతో మాట్లాడారు. ఇక కెసిఆర్ ఫాం హౌస్ లో జరుగుతున్న యాగానికి కూడా స్వరూపానంద స్వామి ని ప్రధాన భూమిక పోషించ బోతున్నారు. కాబట్టి జగన్ ఈ యాగానికి వచ్చే అవకాశముందని తెలుస్తోంది. కేసీఆర్ ఫాంహౌస్లో సహస్ర చండీ యాగం సందర్భంగా జగన్ కెసిఆర్తో పాటు యాగం లో పాల్గొనే అవకాశం ఉంది.
ఇప్పటికే ఏపీలో కెసిఆర్ తో కలిసి జగన్ చంద్రబాబు ను ఎదుర్కోవడానికి ప్లాన్ చేస్తున్నాడు అని టిడిపి నేతలు ఆరోపణలు చేస్తున్న సమయంలో జగన్ కేసీఆర్ చేస్తున్నటువంటి యాగానికి హాజరు కావడం మరిన్ని అనుమానాలకు తావిస్తుంది. అయితే ఏపీ లో జరగనున్న ఎన్నికల్లో జగన్ కేసీఆర్ తో కలిసి చంద్రబాబుపై సమరం చేయడానికి సిద్ధంగా ఉన్నారు అనేది మాత్రం ఈ విషయం ద్వారా అర్థమవుతుంది.
మొత్తానికి కేసిఆర్ నిర్వహిస్తున్న సహస్ర చండీ యాగం దేశంలో ఫెడరల్ ఫ్రంట్ కు ఎలాంటి అడ్డంకులు రాకుండా సక్సెస్ కావడానికా లేక బీజేపీయేతర కూటమి తో అడుగడుగునా కేసీఆర్ కు అడ్డుతగులుతున్నారని భావిస్తున్న చంద్రబాబును ఫెయిల్ చేయడానికా అన్న చర్చ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో జరుగుతోంది.